Toll Plaza: టోల్ ప్లాజాల తొలగింపు.. వాహనదారులకు ఊరట లభించేనా..?
జాతీయ రహదారులపై 60 కిలో మీటర్ల లోపున్న టోల్‌గేట్లను మూసివేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ప్రకటించారు. ఈ విధానం అమలైతే ఏపీలోని దాదాపు 15 టోల్ ప్లాజాలు మూతపడే అవకాశాలున్నాయి....
జాతీయ రహదారులపై 60 కిలో మీటర్ల లోపున్న టోల్‌గేట్లను మూసివేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ప్రకటించారు. ఈ విధానం అమలైతే ఏపీలోని దాదాపు 15 టోల్ ప్లాజాలు మూతపడే అవకాశాలున్నాయి. అయితే తొలగించిన వాటి మేర వాహనదారులకు ఊరట కలుగుతుందా? లేక తొలగించిన టోల్‌ప్లాజాల(Toll Plaza) రుసుములను కూడా ఉన్నవాటిలోనే కలుపుతారా అనే విషయంపై పూర్తి వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జాతీయ రహదారులపై మొత్తం 57 టోల్‌ప్లాజాలు ఉండగా.. కొన్ని చోట్ల 60 కిలోమీటర్ల లోపే టోల్ గేట్లు ఉన్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగే కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారిపై (National High way) అత్యధికంగా 19 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. తెలంగాణలోని నకిరేకల్ నుంచి ఏపీలోని ఏర్పేడు వరకు జాతీయ రహదారి-565 లో దావులపల్లి- మార్కాపురం- వగ్గంపల్లి మధ్య రెండు టోల్ ప్లాజాలు ఉన్నాయి. కర్ణాకలోని హుబ్లి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి-67లో దోర్నాల -ఆత్మకూరు- నెల్లూరు మధ్య డీసీపల్లి, బుచ్చిరెడ్డిపాళెం వద్ద 42.35 కి.మీ. లోపే టోల్ గేట్లు ఉన్నాయి.
కేంద్ర మంత్రి ప్రకటనతో కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు కోస్తా తీరప్రాంత జిల్లాలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారి-216లో ఎన్ని టోల్‌ప్లాజాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కాకినాడ బైపాస్ వద్ద, ఈపూరుపాలెం- ఒంగోలు మధ్య చినగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. మధ్యలో మరో అయిదు ఏర్పాటు కావాల్సి ఉంది. దిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచనలను బట్టి టోల్‌ప్లాజాల తొలగింపు నిర్ణయాలు ఉంటాయని ఎన్‌హెచ్ అధికారులు చెబుతున్నారు.
Also Read
Telangana: నిరుద్యోగులకు అలర్ట్.. ఓటీఆర్‌లో మార్పులకు టీఎస్‌పీఎస్‌సీ అనుమతి.. నేటినుంచే