- Telugu News Photo Gallery Technology photos These are the 5 most famous scooters that women like in India
Scooters: ఇండియాలో మహిళలు మెచ్చే 5 ఫేమస్ స్కూటర్లు ఇవే..!
Scooters:గత కొన్ని సంవత్సరాలుగా టూ వీలర్ మార్కెట్లో స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ రోజు మనం అలాంటి
Updated on: Mar 28, 2022 | 10:13 AM

TVS స్కూటీ పెప్ ప్లస్, ధర రూ. 58-61 వేలు: TVS స్కూటీ పెప్ ప్లస్ భారతదేశంలో అందుబాటులో ఉన్న సరసమైన ICE స్కూటర్. ఈ స్కూటర్‌లో 87.8 సిసి సిలిండర్ ఇంజన్ ఇచ్చారు. దీనికి 5.4 PS పవర్, 6.5 Nm టార్క్ ఇచ్చారు. ఈ స్కూటర్ లైట్ వెయిట్ బాడీతో వస్తుంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్, ధర రూ.64-66 వేలు: టీవీఎస్ స్కూటీ జెస్ట్ అనేది టీవీఎస్ స్కూటర్ పెప్ ప్లస్‌కు శక్తివంతమైన వెర్షన్. ఇందులో కొన్ని మార్పులు చేసినా దీనికి 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇచ్చారు. ఇది 7.8 PS పవర్, 8.8 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.

హోండా డియో, ధర రూ.66-69 వేలు: హోండా 2 వీలర్లు భారతదేశంలో ప్రముఖ బ్రాండ్. ఈ స్కూటర్ 7.8 PS పవర్, 9 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో మాస్ట్రో ధర 66-71 వేల రూపాయలు: హీరో మాస్ట్రో ఎడ్జ్ ఒక కుటుంబ స్కూటర్. ఈ స్కూటర్‌లో 110.9 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఈ స్కూటర్ 8.2 PS పవర్, 8.7 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.

హీరో ప్లెజర్ ప్లస్, రూ. 62-71 వేలు: హీరో మోటోకార్ప్ ప్లెజర్ శ్రేణిలో కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులు వచ్చాయి. సరసమైన ధరలో లభించే ఈ స్కూటర్‌లో 110.9 సిసి సింగిల్ ఇంజన్ అమర్చారు. ఇది 8.2 PS, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.



