Bigg Boss Non Stop Telugu: బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..
బిగ్‌బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) ఇప్పటివరకు మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో
బిగ్‌బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) ఇప్పటివరకు మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో ఆర్జే చైతూ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇక మూడో వారం అనుహ్యంగా సరయు ఎలిమినేట్ అయ్యింది. ఇక నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియలో ఇంట్లో మరోసారి రచ్చ కొనసాగింది. ముందుగా యాంకర్ శివి నామినేషన్స్ ప్రక్రియను షూరు చేశాడు.. యాంకర్ శివ.. మిత్రా శర్మ, అజయ్‌ను నామినేట్ చేయగా.. ఆ తర్వాత అరియానా, అనీల్, మహేష్ విట్టాను నామినేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన అషురెడ్డి.. మహేష్ విట్టా, బిందు మాధవిని.. స్రవంతి, అనీల్, మహేష్ విట్టాను నామినేట్ చేసింది.
తర్వాత హమీదా.. అషురెడ్డి, అరియానాను.. మిత్రాశర్మ, యాంకర్ శివ, మహేష్ విట్టా.. అఖిల్, మిత్రాశర్మ, అషురెడ్డిని నామినేట్ చేశాడు. ఇక అనంతరం వచ్చిన మహేష్ విట్టా, మిత్రాశర్మ, అషు రెడ్డిని నామినేట్ చేయగా.. అనీల్, మిత్రాశర్మను, అరియానాను నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, తేజస్విని, స్రవంతిని నామినేట్ చేయగా.. తేజస్విని, అరియానా, బిందు మాధవిని నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత అజయ్, అరియానాను యాంకర్ శివను నామినేట్ చేయగా.. బిందుమాధవి.. అరియానా, అషురెడ్డిని నామినేట్ చేసింది.
మొత్తానికి నాలుగో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. యాంకర్ శివ, అరియానా, అషురెడ్డి, అనిల్, మిత్రా శర్మ, మహేష్ విట్టా, బిందుమాదవి నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియలో. యాంకర్ శివ, మిత్రా శర్మకు పెద్ద గొడవే జరిగింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, తేజస్విని, నటరాజ్ మాస్టర్, స్రవంతికి మధ్య గొడవ జరిగింది..
Also Read: Penny Song: పెన్నీ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. సీతూపాప ఎంత ముద్దుగా చేసిందో..
Suriya: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో హీరో సూర్య.. 18 ఏళ్ల తర్వాత హీట్ కాంబో రిపీట్..