Deepika Padukone: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శుభవార్త పంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు.

Deepika Padukone: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రెటీలు, ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..
Deepika
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2022 | 8:22 AM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శుభవార్త పంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు..కళాకారులు, పాప్ స్టార్స్, రాజకీయన నాయకులతో ఉన్న ప్రతిష్టాత్మక జాబితాలో దీపికా పేరు చేరింది. ప్రముఖ టైమ్స్ 100 ఇంపాక్ట్ అవార్డు అందుకుంది దీపికా. మానసిక ఒత్తిడిపై అవగాహన కల్పిస్తూ ఆమె అందించిన సేవలు.. అద్భుతమైన చిత్రాలకు గానూ దీపికాను ఈ అవార్డు వరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల జాబితాలో దీపికా చేరిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ” ఈ సోమవారం ఉదయం శుభవార్తతో ప్రారంభమయింది అని నేను అనుకుంటున్నాను.. ఇందుకు ధన్యవాదాలు ” అంటూ పోస్ట్ చేసింది దీపికా. దీంతో ఆమెకు బాలీవుడ్ సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టైమ్స్ 100 అవార్డును.. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు..కళాకారులు, పాప్ స్టార్స్, రాజకీయన నాయకులు ఆయా రంగాల్లో అందించే సేవలకు గుర్తింపు ఈ అవార్డును అందిస్తారు. యుఏఈ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ మంత్రి సార్ అల్ అమీరి, ప్రముఖ సింగర్, రచయిత ఎల్లి గౌల్డింగ్, హుడా బ్యూటీ వ్యవస్థాపకులు హుడా కట్టాన్ ఈ అవార్డును అందుకున్నారు. వారితోపాటు ఈ ఏడాది దీపికా పదుకొనే ఈ అవార్డును అందుకుంది. ప్రస్తుతం దీపికా.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పైథ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏ను మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే.. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫైటర్ సినిమాలోనూ దీపికా నటిస్తోంది. అలాగే.. ది ఇంటర్న్ హిందీ రీమేక్ సినిమాలోనూ దీపికా నటించనుంది.

Also Read: Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్

Harish Shankar: హరీష్ శంకర్ అయితేనే బెటర్ అంటున్న మెగాస్టార్.. ఈమూవీ కోసం అంటే

Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!

S. Thaman : దేవీ శ్రీ పై క్రేజీ కామెంట్స్ చేసిన తమన్.. డార్లింగ్ బ్రదర్ అంటూ డీఎస్పీ ట్వీట్

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో