Beauty Tips: అవిసెగింజలతో అందానికి మెరుగులు.. ఇలా చేసి చూడండి..!
Beauty Tips: అవిసె గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం,
Beauty Tips: అవిసె గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మీరు ఈ విత్తనాలను చర్మానికి ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నిరోధించడంలో సహాయపడతాయి. అవిసె గింజలు చర్మానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. అవిసెగింజలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఇందులో అనేక పదార్థాలు మీ చర్మంపై కనిపించే ముడతలు, మచ్చలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను వదిలించుకోవడానికి పనిచేస్తాయి. ఇది చర్మాన్ని బిగుతుగా, సహజంగా, యవ్వనంగా చేస్తుంది.
అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మరింత హైడ్రేట్ చేయడానికి, లోపల తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి. అవిసె గింజలు మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఇవి శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
ఫ్లాక్స్ సీడ్ ఫేస్ మాస్క్
మీరు అవిసెగింజలని ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. వాటిని నీటిలో నానబెట్టండి. వీటికి ముల్తానీ మిట్టిని కలిపి పేస్ట్‌లా చేయండి. అలాగే ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా కలపండి. దీనిని ముఖంపై అప్లై చేయండి. కాసేపు అలాగే ఉంచి ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సూపర్‌గా పనిచేస్తుంది.