Viral Video: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
మనం ఇప్పటి వరకు ఇలాంటి ఖరీదైన వంటకాల గురించి.. ఐస్ క్రీం గురించి విని వుంటారు. అయితే వాటి విలువ వందల్లో ఉంటుంది లేదా ఒకటి , రెండు వేలు ఉంటుంది. అదే మనం ఇంత కాలం ఖరీదైన వంటకం..
మనం ఇప్పటి వరకు ఇలాంటి ఖరీదైన వంటకాల గురించి.. ఐస్ క్రీం గురించి విని వుంటారు. అయితే వాటి విలువ వందల్లో ఉంటుంది లేదా ఒకటి , రెండు వేలు ఉంటుంది. అదే మనం ఇంత కాలం ఖరీదైన వంటకం అనుకున్నాం. కానీ ఫ్రెంచ్ ఫ్రెస్ ఖరీదు వింటే అమ్మ బాబోయ్ అనాస్లిందే. ఎందుకంటే దాని ధర అలా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రూ. 15 వేలకు పైగా ధర పలుకుతోంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైని న్యూయార్క్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో తయారు చేస్తారు. రెసిపీ చూసి నిజంగానే ఆశ్చర్యం వేసింది. చెప్పడానికి చాలా రకాలు ఉన్నాయి. చాలా విషయాల పేర్లను మొదటిసారి వినవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రికార్డుల్లోకి ఎక్కింది. అది తయారు చేయడం ఇంతకాలం చాలా సీక్రెట్‌గా జరిగేంది. అయితే ఈ ప్రపంచంలోనే అత్యం ఖరీదైన ఫ్రెంచ్ ఫేస్ తయారుచేసే విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పదార్థాలను దిగుమతి చేసుకుని ఈ విలువైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తారు. బంగారు రేకులతో ఈ వంటకాన్ని డెకొరేట్ చేస్తారు. అనేక ఇతర రకాల పదార్థాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారుచేసే వీడియో ఇటీవలే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేయబడింది. ఈ వీడియో తక్కువ సమయంలో వైరల్‌గా మారింది. అన్ని హోటల్స్ లో చేసే సాధారణ ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేసే వైరల్ వీడియోను చూడండి
View this post on Instagram
ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి కాస్ట్యూమ్ పేరు కూడా ఉంది. ఆ బహారీ పేరు క్రీం డెలా క్రీం పోమెస్ ఫ్రైట్స్. ఈ విలువైన ఫ్రెంచ్ ఫ్రైని న్యూయార్క్ నగరంలోని సెరెండిపిటీ రెస్టారెంట్‌లో తయారు చేస్తారు. న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో తయారు చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వారి తరపున షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే 24,000 కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. ఈ విలువైన ఫ్రెంచ్ ఫ్రై తయారీకి ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏయే పదార్థాలను ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్‌స్టేట్ చిప్పర్‌బెక్ బంగాళాదుంపలు, పాతకాలపు 2006 డోమ్ పెరిగ్నాన్ షాంపైన్, J. లెబ్లాంక్ ఫ్రెంచ్ షాంపైన్ ఆర్డెన్నే వెనిగర్, ఫ్రాన్స్ నుంచి స్వచ్ఛమైన కేజ్-ఫ్రీ గూస్ ఫ్యాట్, గ్యురాండే ట్రఫుల్ ఉప్పు, ట్రఫుల్ ఆయిల్, క్రీట్ సెనెసి పెకోరినో టార్టుఫెల్ షేవ్డ్ బ్లాక్ సమ్మర్ ట్రఫుల్స్, ఇటాలీ నుండి ట్రఫుల్స్ A2 100% గ్రాస్ ఫ్రీ ఫెడ్ క్రీమ్ ఆవు పాలతో తయారు చేయబడింది. ఏజ్డ్ గ్రుయెర్ ట్రఫుల్డ్ స్విస్.
ఇక ఫ్రెంచి ఫ్రైస్ తయారు చేస్తే చివరగా గోల్డ్ పౌడర్ ( సన్నని బంగారు రేకులు)తో అలంకరిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌లో 23K ఎడిబుల్ గోల్డ్ డస్ట్ ఉపయోగిస్తారు. మీరు అమెరికాలో ఉంటే.. లేదా మీరు న్యూయార్క్ వెళ్లినప్పుడు ఖచ్చితంగా తినేందుకు ప్లాన్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి: Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..