Summer Drinks: వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఈ 5 దేశీ డ్రింక్స్ సూపర్..!
Summer Drinks: ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య అనేది సర్వసాధారణం. వేసవి కాలంలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలోని మినరల్స్ మొత్తం
Summer Drinks: ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య అనేది సర్వసాధారణం. వేసవి కాలంలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలోని మినరల్స్ మొత్తం బయటకి వెళుతాయి. ఇది డీహైడ్రేషన్ సమస్యకి కారణమవుతుంది. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి నీరు లేదా మరేదైనా ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం ముఖ్యం. వేసవి కాలంలో మజ్జిగ, మామిడి జ్యూస్, కొబ్బరి నీరు, షర్బత్ వంటి అనేక ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవచ్చు. ఇవి రుచికరమైనవే కాకుండా చాలా ఆరోగ్యకరమైనవి కూడా. వీటిలో విటమిన్లు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడానికి పనిచేస్తాయి.
1. మజ్జిగ
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, వేయించిన ఇంగువ కలిపి మజ్జిగ తయారు చేస్తారు. ఇది ప్రోబయోటిక్ డ్రింక్. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మజ్జిగ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
2. ఆమ్ పన్నా
ఆమ్ పన్నా ఒక ఆరోగ్యకరమైన ప్రసిద్ధ పానీయం. వేసవి కాలంలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆమ్ పన్నా పచ్చి మామిడి, జీలకర్ర, పుదీనా, ఉప్పు, బెల్లం మొదలైన వాటితో తయారు చేస్తారు. ఇందులో విటమిన్ ఎ, బి1, బి2, సి, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
3. కొబ్బరి నీరు
కొబ్బరి నీరు చాలా ఆరోగ్యకరమైన పానీయం. ఎండాకాలంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది పోషకాహారంతో నిండి ఉంటుంది. ఈ పానీయంలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రోలైట్స్ గొప్ప మూలం కూడా. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది.
4. నిమ్మకాయ షర్బత్
నిమ్మకాయ షర్బత్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్. ఇది శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి పనిచేస్తుంది. దీని రుచి తీపి, పుల్లగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది. ఇందులో చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.