సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.. ఈ పనిచేయకపోతే ఏప్రిల్‌ 1 నుంచి అకౌంట్లు క్లోజ్..!

PPF, NPS, SSY: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాదారులు కచ్చితంగా

సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.. ఈ పనిచేయకపోతే ఏప్రిల్‌ 1 నుంచి అకౌంట్లు క్లోజ్..!
Money
Follow us
uppula Raju

|

Updated on: Mar 28, 2022 | 3:33 PM

PPF, NPS, SSY: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాదారులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. వాస్తవానికి మీ ఖాతా సక్రియంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్చి 31 నాటికి కచ్చితంగా మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్స్‌ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ ఖాతాలను తనిఖీ చేయకుంటే ఈరోజే తనిఖీ చేయండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలలో ఎలాంటి డబ్బును జమ చేయకుంటే మార్చి 31, 2022లోగా తప్పనిసరిగా కనీస మొత్తాన్ని జమ చేయండి. లేదంటే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. వాస్తవానికి ఈ ఖాతాలు ఒకసారి డీయాక్టివేట్ అయితే వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాలి.

PPFలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం

ఒక ఆర్థిక సంవత్సరానికి PPFలో కనీస వార్షిక సహకారం రూ. 500. ఈ మొత్తం జమచేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022 అని తెలుసుకోండి. ఇప్పటివరకు డబ్బులు డిపాజిట్ చేయకపోతే, వెంటనే చేయండి. లేకపోతే మీరు ప్రతి సంవత్సరం రూ. 50 జరిమానాతో పాటు సంవత్సరానికి రూ. 500 బకాయి చందా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఖాతా మూసివేస్తే మీకు ఎటువంటి రుణం లభించదు.

NPSలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం

నిబంధనల ప్రకారం.. టైర్-I NPS ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయడం తప్పనిసరి. ఈ సమయంలో NPS టైర్-I ఖాతాలో కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా నిష్క్రియంగా మారుతుంది. ఇందుకోసం రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఒకరికి టైర్ II ఎన్‌పిఎస్ ఖాతా ఉంటే టైర్-I ఖాతా ఫ్రీజింగ్‌తో పాటు, టైర్-II ఖాతా కూడా ఆటోమేటిక్‌గా క్లోజ్‌ అవుతుందని తెలుసుకోండి.

సుకన్య సమృద్ధి యోజన ఖాతా పథకం

సుకన్య సమృద్ధి ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయడం తప్పనిసరి. లేదంటే దీనికి రూ.50 జరిమానా విధిస్తారు. ఈ పరిస్థితిలో మీరు కనీస మొత్తాన్ని జమ చేయకుంటే ఈరోజే జమ చేయండి.

Housing Prices: వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం.. కారణాలు ఇలా ఉన్నాయి..!

IDFC First Bank: పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు పెంచిన IDFC.. ఎంత పెంచిందంటే..?

Mithali Raj: మిథాలీ రాజ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. స్మృతి మంధాన లేదా హర్మన్‌ప్రీత్ కౌర్..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.