Indian Railways: రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఈ విషయంలో మీకు నష్టపరిహారం అందుతుంది..!

Indian Railways: రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా తెలిసుండాలి. వాస్తవానికి రైల్వే ప్రయాణికులలో 80 శాతం

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఈ విషయంలో మీకు నష్టపరిహారం అందుతుంది..!
Follow us
uppula Raju

|

Updated on: Mar 28, 2022 | 3:54 PM

Indian Railways: రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా తెలిసుండాలి. వాస్తవానికి రైల్వే ప్రయాణికులలో 80 శాతం మందికి ఈ విషయాలు తెలియవు. ప్రయాణంలో మీ సామాను చోరీకి గురైతే దానికి నష్ట పరిహారం పొందవచ్చు. ఇది మాత్రమే కాదు మీ వస్తువులు 6 నెలల్లోపు అందకపోతే వినియోగదారుల ఫోరమ్‌కు కూడా వెళ్లవచ్చు. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం.. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ లగేజీ చోరీకి గురైతే మీరు ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిపోర్టు చేయవచ్చు. అలాగే 6 నెలలైనా మీ సరుకులు అందకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు వస్తువుల ధరను అంచనా వేయడం ద్వారా రైల్వే మీకు నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. దీని ద్వారా మీ నష్టం భర్తీ అవుతుంది.

మీకు వెయిటింగ్ టిక్కెట్ ఉంటే మీరు రైలులో రిజర్వ్ చేసిన కోచ్‌లో ప్రయాణించలేరు. ఒకవేళ ప్రయాణంలో పట్టుబడితే కనీసం రూ.250 జరిమానా చెల్లించి తదుపరి స్టేషన్ నుంచి జనరల్ కోచ్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణ సమయంలో మీకు టికెట్ లేకపోతే రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం మీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ కింద మీరు ప్రయాణించిన దూరానికి రైల్వే నిర్ణీత సాధారణ ఛార్జీ లేదా రైలు బయలుదేరిన స్టేషన్ నుంచి నడిచే దూరానికి నిర్ణీత సాధారణ ఛార్జీ లేదంటే రూ.250 జరిమానా వేయవచ్చు.

మీకు ఒకవేళ లోయర్ క్లాస్ టికెట్ ఉంటే ఛార్జీలో ఎంత వ్యత్యాసం ఉంటుందో దానిని కూడా వసూలు చేస్తారు. అంతే కాకుండా టికెట్ ట్యాంపరింగ్ చేస్తూ ప్రయాణీకులు పట్టుబడితే రైల్వే సెక్షన్ 137 కింద కేసు నమోదు చేస్తారు. ఇందులో ప్రయాణీకుడికి 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి.

సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.. ఈ పనిచేయకపోతే ఏప్రిల్‌ 1 నుంచి అకౌంట్లు క్లోజ్..!

Housing Prices: వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం.. కారణాలు ఇలా ఉన్నాయి..!

Mithali Raj: మిథాలీ రాజ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. స్మృతి మంధాన లేదా హర్మన్‌ప్రీత్ కౌర్..!