Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IDFC First Bank: పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు పెంచిన IDFC.. ఎంత పెంచిందంటే..?

IDFC First Bank: IDFC ఫస్ట్ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లను మార్చింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చాయి.

IDFC First Bank: పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు పెంచిన IDFC.. ఎంత పెంచిందంటే..?
Money
Follow us
uppula Raju

|

Updated on: Mar 28, 2022 | 3:19 PM

IDFC First Bank: IDFC ఫస్ట్ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లను మార్చింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చాయి. ప్రభుత్వం నుంచి ప్రైవేట్‌ బ్యాంకుల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్‌బిఐ ), ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఇటీవల వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మాత్రం ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లని  పెంచబోతోంది. ఎప్పటికప్పుడు అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ప్రకారం వడ్డీ రేట్లు అందించనున్నట్లు తెలిపింది. కొత్త రూల్ ప్రకారం.. ప్రోగ్రోసివ్ ప్రాతిపదికన వడ్డీ రేట్ల స్లాబ్ ప్రకారం కస్టమర్లకు రిటర్న్‌లు అందించనుంది.

ఏప్రిల్ 1, 2022 నుంచి IDFC ఫస్ట్ బ్యాంకు రూ. 25 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై  6% వడ్డీ చెల్లించనుంది. రూ.లక్షకు పైబడిన డిపాజిట్లపై 4%, రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు 4.50 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య డిపాజిట్లపై 5%, రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య డిపాజిట్లపై 6 శాతం, రూ.1 కోటి, రూ.100 కోట్లు 5 శాతం, 100 కోట్ల నుంచి 200 కోట్ల డిపాజిట్లపై 4.50 శాతం, 200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 1 ఏప్రిల్ 2022 నుంచి వర్తిస్తాయి.

వడ్డీ ఎలా లెక్కిస్తారు..

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. నాన్-లీప్ (ఫైనాన్షియల్) సంవత్సరంలో పడే FDలకు 365-రోజుల ప్రాతిపదికన, లీప్ (ఫైనాన్షియల్) సంవత్సరంలో పడే FDలకు 366-రోజుల ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు.

ప్రోగ్రెసివ్ బేస్ అంటే ఏమిటి

1. IDFC ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్‌లకు వడ్డీని ప్రగతిశీల ప్రాతిపదికన లెక్కిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వనున్న కొత్త రేట్లు దీని ఆధారంగానే లెక్కిస్తారు.

2. మీ ఖాతాలో రూ.25,000 బ్యాలెన్స్ ఉంటే ఈ మొత్తానికి 4% చొప్పున వడ్డీ చెల్లిస్తుంది.

3. మీ ఖాతాలో రూ.5 లక్షలు బ్యాలెన్స్ ఉంటే అప్పుడు ఒక లక్షపై 4 శాతం మిగతా రూ. 4 లక్షలపై 4.5% వడ్డీ ఉంటుంది.

4. మీ ఖాతాలో రూ.1.10 కోట్లు బ్యాలెన్స్ ఉంటే 1 లక్షపై 4 శాతం, 9 లక్షలపై 4.5 శాతం, 1 కోటిపై 5 శాతం వడ్డీ ఉంటుంది.

5. మీ ఖాతా బ్యాలెన్స్ రూ. 5.3 కోట్లు అయితే 1 లక్షపై 4 శాతం, 9 లక్షలపై 4.5 శాతం, 5.2 కోట్లపై 5 శాతం వడ్డీ ఉంటుంది.

Mithali Raj: మిథాలీ రాజ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. స్మృతి మంధాన లేదా హర్మన్‌ప్రీత్ కౌర్..!

Beauty Tips: అవిసెగింజలతో అందానికి మెరుగులు.. ఇలా చేసి చూడండి..!

IPL 2022: ఇంజనీరింగ్‌ చదివి క్రికెటర్ అయ్యాడు.. ఇప్పుడు ఐఎస్‌బీ హైదరాబాద్‌లో అడ్మిషన్‌.. ఎటువైపు మొగ్గుచూపు..!