Viral Video: వాళ్ల రెక్కలను కత్తిరించవద్దు.. కత్తిరించాల్సి వస్తే మీ రెక్కలు కత్తిరించుకోండి.. మిస్ యూనివర్స్ – 2021 కామెంట్స్
హిజాబ్ (Hijab) తో పాటు అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాలంటూ మిస్ యూనివర్స్ - 2021 హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) విజ్ఞప్తి చేశారు. హిజాబ్‌తో పాటు పలు అంశాలలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం...
హిజాబ్ (Hijab) తో పాటు అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాలంటూ మిస్ యూనివర్స్ – 2021 హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) విజ్ఞప్తి చేశారు. హిజాబ్‌తో పాటు పలు అంశాలలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాలంటూ ఆమె సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. హిజాబ్ అంశంపై మీ స్పందన ఏమిటని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. మహిళలను వాళ్లకు నచ్చినట్లుగా బతకనివ్వాలని కోరారు. మార్చి 17న ఆమె రాకకు గౌరవంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు జరిగింది. వాస్తవానికి మిస్ యూనివర్స్ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని నిర్వాహకులు ముందుగానే రిపోర్టర్లకు సూచించారు. అయినప్పటికీ ఓ రిపోర్టర్ ఇలాంటి ప్రశ్న అడగడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా తన ప్రయాణం, తాను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందుల గురించి ఎవైనా ప్రశ్నలు అడిగితే సంతోషిస్తానని హర్నాజ్ ఆ రిపోర్టర్‌కు బదులిచ్చారు.
‘‘నిజాయతీగా చెప్పాలంటే.. మీరు ఎప్పుడూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. హిజాబ్ విషయంలో కూడా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. అమ్మాయిలు తాము ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి.. వాళ్ల గమ్యాన్ని చేరుకోనివ్వండి, ఎగరనివ్వండి, ఎందుకంటే అవి వాళ్ల రెక్కలు, వాటిని కత్తిరించవద్దు. ఒకవేళ కత్తిరించాల్సి వస్తే మీ రెక్కలు కత్తిరించుకోండి’
– హర్నాజ్ సంధు, మిస్ యూనివర్స్ – 2021
हिजाब पर बोलती हुई मिस यूनिवर्स हरनाज़ संधु♥️#Hijab #HarnaazSandhu pic.twitter.com/imSJamLrTh
— Mohd Amir Mintoee (@MAmintoee) March 26, 2022