AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: ఇండస్ట్రీలో రీ షూట్ తీస్తే సినిమా పోయింది అనేవాళ్ళు.. కానీ ఇప్పుడు అలా కాదు.. నాగశౌర్య కామెంట్స్ వైరల్..

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya), షెర్లి సెటియా జంటగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari). ఈ చిత్రానికి అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వం

Naga Shaurya: ఇండస్ట్రీలో రీ షూట్ తీస్తే సినిమా పోయింది అనేవాళ్ళు.. కానీ ఇప్పుడు అలా కాదు.. నాగశౌర్య కామెంట్స్ వైరల్..
Naga Shaurya
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2022 | 6:43 AM

Share

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya), షెర్లి సెటియా జంటగా నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari). ఈ చిత్రానికి అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించగా.. ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో నిర్మాత ఉష మూల్పూరి నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్‏గా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ లాంచ్ చేశారు.. అనంతరం ఏర్పాటైన సమావేశంలో అనిల్ రావిపూడి, బివియస్ రవి, హీరో నాగ శౌర్య, హీరోయిన్ షెర్లి సెటియా, దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణ, నిర్మాత ఉష మూల్పూరి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది.. సెట్లో టీమ్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసాను. ఒకప్పుడు ఇండస్ట్రీలో రీ షూట్ తీస్తే సినిమా పోయింది అనేవాళ్ళు. ఇప్పుడు రీ షూట్ తీయకపోతే సినిమా పోయేలా ఉంది. పర్ఫెక్షన్ కోసం అలా తీసుకొచ్చారు. మా డైరెక్టర్ అనిష్, మా అమ్మ సినిమాకి ఎంతకావలంటే అంత ఖర్చుపెట్టి కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తీశారు. అందరికీ సినిమా నచ్చేంత వరకు తీస్తూనే ఉన్నాం. ఫైనల్ గా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఐరా క్రియేషన్స్ నుండి సినిమా వస్తుంది.. గ్యారెంటీగా చాలా పెద్ద హిట్ కొట్టాలి అని కసితో ఈ సినిమా చేసింది. ఆ విషయంలో అచీప్ చేసింది మా అమ్మ. సినిమా చూసాను.. చాలా చాలా బాగుంది. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో నాకు హిట్ పడాలి అనేది ఇంకా ఇష్టం. అనిష్ మంచి కథతో చెప్పింది చెప్పినట్టు తీశారు. అనిల్ రావిపూడి గారి సినిమాలో ఎంత కామిడి ఉంటుందో నేను ఈ సినిమాలో అంత కామిడి చూశాను. అడవాళ్ళతో ఏదొ రకంగా సత్ సంబంధాలు ఉంటాయి.. ఆ కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా ఉంటుంది. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి ప్రాణం. ఎలాగైనా ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయనే అనిష్ ని పంపించి కథ వినమన్నారు.. మంచి సినిమా చేశారు. సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తనతో 5సినిమాలు చేశాను. షెర్లిన్ చేసిన మస్క మూవీ చూసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్ గా చేసింది.. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తనకి.. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదలవుతుంది. అన్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాగే ఇండస్ట్రీలో సినిమాలు ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఐరా క్రియేషన్ బ్యానర్ అంటే సినిమాలు లవ్ చేస్తారు.. ఆ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ ని కూడా అంతే బాగా చూసుకుంటారు. సొంత కుటుంబ సబ్యుల్లా చూసుకుంటారు.. అది మంచి ఆలోచన. అదే కంటిన్యూ చేయాలి. మంచి సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే వుంటారు. తీస్తూనే వున్నారు. ఈ సినిమా కూడా చలో కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అనిష్ నాకు బాగా తెలుసు. మంచి టాలెంట్ ఉంది. కచ్చతంగా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సాయి శ్రీరామ్ చక్కటి విజువల్స్ ఇచ్చాడు. సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శౌర్య ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి రీచ్ అయ్యాడు. డెఫినెట్ గా శౌర్య ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి.. అన్నారు..

Also Read: Dubai Expo 2020: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, రణవీర్ సింగ్

Harish Shankar: హరీష్ శంకర్ అయితేనే బెటర్ అంటున్న మెగాస్టార్.. ఈమూవీ కోసం అంటే

Tollywood: ఇన్​స్టాలో ఒక్క పోస్ట్‌కు సమంత ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ తినాల్సిందే..!

S. Thaman : దేవీ శ్రీ పై క్రేజీ కామెంట్స్ చేసిన తమన్.. డార్లింగ్ బ్రదర్ అంటూ డీఎస్పీ ట్వీట్

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!