AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్

బాలీవుడ్ లో కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చే పేరు కంగనా. వివాదాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు అందరు. దేశంలో ఎలాంటి సంఘటన జరిగిన కంగనా స్పందిస్తుంది.

Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. 'ఆస్కార్' ఘటన పై కంగనా రియాక్షన్
Kangana
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2022 | 6:59 PM

Share

Kangana Ranaut : బాలీవుడ్‌లో కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చే పేరు కంగనా. వివాదాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు అందరు. దేశంలో ఎలాంటి సంఘటన జరిగిన కంగనా స్పందిస్తుంది. అలాగే తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది ఈ అమ్మడు. తాజాగా కంగనా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో విల్‌ స్మిత్‌ చేసిన పనిని కంగనా సమర్ధించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి అకాడమి అవార్డ్స్.. (ఆస్కార్ అవార్డ్స్). గత రెండేళ్ల తర్వాత ఈ వేడుకలను ఘనంగా నిర్వహించగా.. భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే ఎంతో అట్టహసంగా జరుగుతున్న ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో షాకింగ్ ఘటన జరిగింది. హాలీవుడ్‌ హీరో విల్‌స్మిత్‌ ఈ వేడుకలకు హాజరయ్యాడు. ఆ సమయంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నటుడు క్రిస్‌ రాక్‌.. విల్‌ స్మిత్‌ భార్య జాడా పింకెట్ స్మిత్ పై జోకులు పేల్చాడు. దీంతో కోపగించుకున్న విల్‌ స్మిత్‌ స్టేజ్‌ పైకి వచ్చి క్రిస్‌రాక్‌ చెంపపై కొట్టాడు.

దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే విల్ స్మిత్ కొట్టిన ఈ చెంపదెబ్బని క్రిస్‌రాక్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు.. స్మిత్‌ మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ.. నా భార్య పేరు నీ నోటి నుంచి రానివ్వకు అంటూ గట్టిగా అరిచాడు. విల్ స్మిత్ ప్రవర్తన చూసి అక్కడున్నవారు షాకయ్యారు. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు క్రిస్ రాక్ ని సపోర్ట్ చేయగా మరి కొందరు విల్ స్మిత్ కి మద్దతుగా నిలిచారు. తాజాగా కంగనా స్పందిస్తూ.. “విల్ స్మిత్ చెంపపై కొట్టి వదిలేసాడు. నేనైతై ఇంకా గట్టిగా తన్నేదాన్ని. ఫూల్స్ నవ్వించడానికి ఎవడైనా ఇడియట్ మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని ఉపయోగించుకుంటే..నేను విల్ స్మిత్ లాగే చేస్తాను.. ఇలాంటి వాళ్లని వదిలి పెట్టకూడదు. ఆయన త్వరలోనే నా లాక్ అప్ షోకి వస్తాడని ఆశిస్తున్నా’ అని ఇన్ స్టా రీల్స్ లో రాసుకొచ్చింది కంగనా..

Smith

మరిన్ని ఇక్కడ చదవండి :  Alia Bhatt: ఆర్‌ఆర్‌ఆర్‌పై అలియా అలిగిందా? సోషల్‌ మీడియాలో జక్కన్న సినిమా ఫొటోలు డిలీట్‌ ఎందుకు? సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే.. RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..