Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. హైకోర్టుకు 800 పేజీల నివేదిక..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎక్సైజ్ శాఖ అధికారులపై ఈడీ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను పాటించలేదని

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. హైకోర్టుకు 800 పేజీల నివేదిక..
Telangna High Court
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2022 | 1:43 PM

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎక్సైజ్ శాఖ అధికారులపై ఈడీ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను పాటించలేదని..తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు 800 పేజీలతో పోలీసులు నివేదిక సమర్పించారు. 12 కేసుల ఎఫ్‌ఐఆర్‌లతోపాటు చార్జిషీట్లు, స్టేట్‌మెంట్లు, నిందితులు, సాక్షుల వివరాలన్నీ పొందుపర్చారు. నిందితులు, సినీ తారలకు చెందిన.. 600 GB వీడియో రికార్డులు అందజేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు హైకోర్టుకు మొత్తం 10 ఆడియో క్లిప్స్‌, కాల్‌ డేటా కూడా సమర్పించారు. ఈ సాక్ష్యాలను అన్నింటినీ ఈడీకి అందజేసింది హైకోర్టు. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ మరింత వేగంగా విచారణ చేపట్టింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ అధికారులు తన పిటిషన్‌లో ప్రస్తావించారు. దీంతో సోమేశ్‌కుమార్‌, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసు పంపించినట్లు తెలిపింది. వారిద్దరిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఈడీ కోరింది.

మరోవైపు బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే ఈడీ దూకుడు చూపిస్తోంది. ఈ డ్రగ్స్‌ కేసులో లింకులు అక్కడి నుంచి టాలీవుడ్‌ వరకు ఉండడంతో.. నిందితులు, అనుమానితులు, బాధితుల వివరాలు సేకరించేందుకు హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. దీంతో హైకోర్టు ద్వారా ఈ కేసు వివరాలు తెలంగాణ పోలీసుల నుంచి ఈడీకి బదిలీ అయ్యాయి.

Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..

Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్

Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్