RRR Movie: ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత.. ఒక్కరోజే రికార్డ్స్ స్తాయిలో కలెక్షన్స్..
ఆర్ఆర్ఆర్ (RRR) థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై 5 రోజులు కాగా కలెక్షన్స్ పరంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి
ఆర్ఆర్ఆర్ (RRR) థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై 5 రోజులు కాగా కలెక్షన్స్ పరంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తొలిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్తాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే విడుదలైన నాలుగు రోజుల్లోనే హిందీలో వందకోట్ల మార్క్ దాటేసింది. మంగళవారం ఒక్కరోజే దాదాపు రూ. 16 నుంచి రూ. 17 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్‌కు అంటే గుజరాత్, యూపి, బీహార్, ఒడిశా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఐదవ రోజు ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 16 వచ్చినట్లుగా సమాచారం.
ఇక ఇప్పటికే తెలుగులో రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే హిందీలో రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా..మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 15 కోట్లు వసూలు చేసి రూ. 173 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు అన్ని భాషల కలెక్షన్స్ నుంచి ఓవర్సీస్ కలిపి ఐదవ రోజున రూ.40 నుంచి 45 కోట్లు వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ఇప్పటివరకూ రూ. 600 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ సినిమా టికెట్స్ తిరగరాసింది.
ఈ సినిమాలో అల్లూరి సీతారామారాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటించారు..అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. అలియా భట్.. శ్రియా సరన్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు.
Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం
NTR: యంగ్ టైగర్ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..
Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్
Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్