Manchu Manoj: మంచు మనోజ్‌ కారును ఆపిన ట్రాఫిక్‌ పోలీసులు.. జరిమానా విధింపు..

Manchu Manoj: నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై హైదరాబాద్‌ (Hyderabad) ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వాహనాలపై ఉన్న స్టిక్కర్లను తొలగించడం నుంచి మొదలైన వ్యవహరం ప్రస్తుతం కార్ల బ్లాక్‌ ఫిలింలను తొలగించే వరకు చేరింది...

Manchu Manoj: మంచు మనోజ్‌ కారును ఆపిన ట్రాఫిక్‌ పోలీసులు.. జరిమానా విధింపు..
Manchu Manoj
Follow us

|

Updated on: Mar 30, 2022 | 2:36 PM

Manchu Manoj: నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై హైదరాబాద్‌ (Hyderabad) ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వాహనాలపై ఉన్న స్టిక్కర్లను తొలగించడం నుంచి మొదలైన వ్యవహరం ప్రస్తుతం కార్ల బ్లాక్‌ ఫిలింలను తొలగించే వరకు చేరింది. ఇక సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమాన విధిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు (Tollywood) చెందిన పలువురు ప్రముఖు హీరోల వాహనాలకు అధికారులు జరిమాన విధించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ జాబితాలోకి మంచు మనోజ్‌ కూడా వచ్చి చేరారు. పోలీసులు రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా బుధవారం టోలిచౌకిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటుగా వెళుతోన్న మంచు మనోజ్‌ కారును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో మనోజ్‌ స్వయంగా కారు నడుపుతున్నారు. దీంతో కారు అద్దాలకు బ్లాక్‌ ఫిలింను గుర్తించిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు గాను రూ. 700 చలాన్‌ విధించారు. అంతేకాకుండా అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింను తొలగించారు.

ఇదిలా ఉంటే తాజాగా కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిలిం ఉన్నాయన్న కారణంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌ల కార్లకు జరిమాన విధించిన పోలీసులు, బ్లాక్‌ ఫిలింలను తొలగించిన విషయం తెలిసిందే.

Also Read: Breaking! టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఎప్పుడు?.. ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు..

Ugadi 2022: ఉగాదిరోజున ఈ పనులు చేస్తే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం..

Shocking Video : 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం చూశారా..!