AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Halal Row: హలాల్ మాంసాన్ని కొనేది లేదు.. ఆ రాష్ట్రంలో మరో కొత్త రచ్చ.. స్పందించిన ముఖ్యమంత్రి..

కర్నాటకలో కొత్త రచ్చ మొదలైంది. హిజాబ్ వివాదం(Hijab) ముగిసింది అనుకునేంతలో మరో కాంట్రవర్సీకి తెరలేసింది. ఇప్పుడు హలాల్(Halal ) చేసిన మాంసాన్ని బహిష్కరించాలంటూ..

Halal Row: హలాల్ మాంసాన్ని కొనేది లేదు.. ఆ రాష్ట్రంలో మరో కొత్త రచ్చ.. స్పందించిన ముఖ్యమంత్రి..
Halal Row
Sanjay Kasula
|

Updated on: Mar 31, 2022 | 11:35 AM

Share

కర్నాటకలో కొత్త రచ్చ మొదలైంది. హిజాబ్ వివాదం(Hijab) ముగిసింది అనుకునేంతలో మరో కాంట్రవర్సీకి తెరలేసింది. ఇప్పుడు హలాల్(Halal ) చేసిన మాంసాన్ని బహిష్కరించాలంటూ ప్రచారం మొదలైంది. హలాల్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఈ  అంశం ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బహిష్కరణపై హిందువుల నుంచి అనుకూలత లభిస్తుండటం.. ముస్లింల నుంచి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. అయితే హలాల్ మాంసం బహిష్కరణ ప్రచారంపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. చాలా సంస్థలు అనేక సమస్యలపై నిషేధిస్తున్నాయి. వాటిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఇది ప్రభుత్వం చెబుతున్నట్లు కాదన్నారు. ఏ సమయంలో ఏ ప్రకటన చేయాలో అప్పుడు తాను స్పందిస్తానని అన్నారు.

బుధవారం విలేకరుల సమావేశంలో సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిజాబ్ సమస్యతోపాటు ఇతర కేసులలో న్యాయ వ్యవస్థ రక్షణ కల్పిస్తుందన్నారు. సామాన్యులకు శాంతి, అభివృద్ధి, భద్రతే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. మొదటి నుంచి కొన్ని నియమాలు, ఆచారాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందన్నారు. తమ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రైట్ వింగ్ డిమాండ్ చేసిందా, లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా అనేది తమకు ప్రధానం కాదని.. తమ ప్రధాన ఆలోచన శాంతి, అభివృద్ధి, సామాన్యులకు భద్రతన్నారు సీఎం బొమ్మై.

హలాల్ మాంసం బహిష్కరణ తప్పు: హిందూ జాతరల సమయంలో ముస్లిం వ్యాపారులను నిషేధించిన తర్వాత హలాల్ బహిష్కరణ అనే అంశం తెరపైకి వచ్చింది. హలాల్‌ చేసి వధించిన కోడి, గొర్రెలు, మేక మాంసాన్ని బహిష్కరించాలంటూ కొన్ని హిందూ సంస్థలు ప్రచారంలో మొదలు పెట్టాయి. తాము కొంటున్న మాంసాన్ని హలాల్  చేయవద్దని ముస్లిం వ్యాపారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలావుంటే.. ఉగాది పండగ మరుసటి రోజు హొసతోడకు జరుపుకుంటారు. మైసూరు, రామనగర, మాండ్య జిల్లాలలో కొత్త సంవత్సర వేడుకలలో ఇది అంతర్భాగంగా ఉంటుంది. చాలా మంది హిందువులు ఆ రోజు మాంసం తింటారు. అయితే ముస్లిం వ్యాపారుల నుంచి హొసతోడకు మాంసం కొనొద్దని రైట్ వింగ్ గ్రూపులు హిందువులను కోరుతున్నాయి. ఈ మాంసాన్ని హిందూ దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదని చెబుతున్నాయి.

హలాల్ కట్ అంటే ఏమిటి?: జంతువులు, పక్షులను చంపే ముందు వాటిని చంపే నియమాన్ని హలాల్ అంటారు. జంతువుకు మొదట నీరు పోసి మక్కా ముఖం వైపుగా ఆ జంతువును వధించాలి. తలను పూర్తిగా నరికివేయకుండా గొంతును సగం వరకు మాత్రమే కట్ చేసి.. జంతువు శరీరం నుంచి రక్తం మొత్తం బయటకు వెళ్లాలి. చంపే వ్యక్తి తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి. వారు నమ్మే దేవుడికి ఆ జంతువును బలి ఇస్తున్నట్లుగా చెప్పిన తర్వాత వధించబడాలి. వధకు ముందే ఆ జంతువు చనిపోకూడదు. హలాల్ మాంసం ఈ పద్ధతిలో మతపరంగా తయారు చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..