NAAC Recruitment 2022: రూ.50 వేల జీతంతో..నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడియేషన్ కౌన్సిల్‌లో ఉద్యోగాలు..అర్హతలివే!
భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడియేషన్ కౌన్సిల్ (NAAC).. ఒప్పంద ప్రాతిపదికన డేటా అప్లికేషన్ మేనేజర్, సీనియర్ అప్లికేషన్..
NAAC Benagaluru Recruitment 2022: భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడియేషన్ కౌన్సిల్ (NAAC).. ఒప్పంద ప్రాతిపదికన డేటా అప్లికేషన్ మేనేజర్, సీనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్, జూనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్ పోస్టుల (Data Application Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: డేటా అప్లికేషన్ మేనేజర్, సీనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్, జూనియర్ అప్లికేషన్ ప్రోగ్రామర్ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ. 25,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/బీఈ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: recruitnaacbengaluru@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: