AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South West Monsoon; మండే ఎండల్లో.. కరోనా కష్ట కాలంలో చల్లని వార్త మోసుకొచ్చిన వాతావరణ శాఖ

మండే ఎండల వేళ, కరోనా కష్ట కాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అనుకున్న ప్రకారమే జూన్ 1న...

South West Monsoon; మండే ఎండల్లో.. కరోనా కష్ట కాలంలో చల్లని వార్త మోసుకొచ్చిన వాతావరణ శాఖ
Monsoon
Rajesh Sharma
|

Updated on: May 06, 2021 | 5:43 PM

Share

South West Monsoon arriving by June 1st: మండే ఎండల వేళ, కరోనా కష్ట కాలంలో వాతావరణ శాఖ (METEOROLOGICAL DEPARTMENT)  చల్లని కబురు అందించింది. జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు (SOUTH-WEST MONSOON) కేరళ తీరాన్ని(KERALA COAST) తాకుతాయని రైతులకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. అనుకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళ (KERALA)ను తాకనున్నట్టు పేర్కొంది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేసింది. అయితే ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15న రుతుపవనాల రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ మరింత వివరమైన ప్రకటన చేసే అవకాశం వుంది.

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సమయంలో నమోదయ్యే వర్షపాతం (RAINFALL) వివరాలపై మే 31న నివేదక వెల్లడిస్తామని తెలిపింది. దేశంలో నైరుతి రుతపవనాలు ఈ ఏడాది కూడా సాధారణంగా ఉంటాయని ఐఎండీ (IMD) తెలిపింది. వరుసగా మూడో ఏడాదీ సాధారణ వర్షపాతం నమోదయ్యేలా రుతుపవనాలు విస్తరించనున్నాయని ఏప్రిల్ (APRIL) మూడో వారంలో వెల్లడించిన అంచనాల్లో ఐఎండీ పేర్కొంది. ఏటా నైరుతికి ముందు ఏప్రిల్, మే (MAY) నెలల్లో రుతుపవనాల తీరుతెన్నులపై అంచనాలను రూపొందిస్తుంది.

వరుసగా రెండేళ్ల పాటు ఇండియా (INDIA)లో సగటు కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ముఖ్యంగా ఈ వర్షపాతం వల్ల వ్యవసాయరంగానికి, తద్వారా ఎకానమీ (ECONOMY)కి ఈ రుతుపవనాలు ఎంతో దోహదం చేస్తాయని భావిస్తున్నట్టు ఈ శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 16 నే తాము ఈ అంచనాకు వచ్చామని, 40 శాతం నార్మల్‌గా, 39 శాతం కొంతవరకు తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

లాంగ్ పీరియడ్ ఏవరేజ్ ని బట్టి చూస్తే ఇది 98 శాతం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. దేశం మొత్తం మీద 880 మి.మీ.వర్షపాతం పడవచ్చు అని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రెండు సంవత్సరాలుగా దేశంలో అధిక వర్షపాతం నమోదయింది. దేశంలో పశ్చిమ, తూర్పు, మధ్యస్థ రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావాన్ని మదింపు చేసేందుకు ఈ ప్లాన్ దోహదపడుతుంది. అయితే అకాల వర్షాల ముప్పు కూడా పొంచి ఉందని, వేసవిలో ఇలా అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏమైనా మొత్తం మీద దేశంలో వర్షపాతం ఈ సారి సంతృప్తికరంగా ఉండగలదని అంచనా వేసింది.

ALSO READ: ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల ఆక్రందనలు.. పెరిగిన ఉత్పత్తి.. అయినా సమస్యే ఎందుకంటే?