Oxygen Scarcity: ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల ఆక్రందనలు.. పెరిగిన ఉత్పత్తి.. అయినా సమస్యే ఎందుకంటే?

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. ఏప్రిల్ ముప్పయవ తేదీన 4 లక్షలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆ తర్వాత నాలుగైదు రోజుల పాటు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపించింది. కానీ అంతలోనే తిరిగి నాలుగు...

Oxygen Scarcity: ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల ఆక్రందనలు.. పెరిగిన ఉత్పత్తి.. అయినా సమస్యే ఎందుకంటే?
Oxygen
Follow us
Rajesh Sharma

|

Updated on: May 06, 2021 | 3:02 PM

Oxygen Scarcity across the country: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. ఏప్రిల్ ముప్పయవ తేదీన 4 లక్షలకుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆ తర్వాత నాలుగైదు రోజుల పాటు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపించింది. కానీ అంతలోనే తిరిగి నాలుగు లక్షల అంకెను దాటేసింది. మే 5 నుంచి 6వ తేదీన ఉదయం దాకా నమోదైన కేసుల సంఖ్య మరోసారి నాలుగు లక్షలు దాటడంతో ఇటు ప్రజల్లోను, అటు ప్రభుత్వంలోను కలవరం పెరిగిపోయింది. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. కరోనా బారిన పడుతున్న బాధితులకు సరైన చికిత్స అందక మృత్యువాత పడుతున్న పరిస్థితి. కరోనా సోకిన వారికి ఊపిరి అందించడమే మార్గం కాగా.. దేశంలోని చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో లేక మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు.. నిబంధనలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. కాస్త ఆలస్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. దాంతో ఎట్టకేలకు ఆక్సిజన్ సరఫరా ఊపందుకుంది. సిలిండర్ల తరలింపు, ఖాళీ సిలిండర్లు మార్చటానికి సుశిక్షుతులైన సిబ్బంది అవసరమున్నప్పటికీ.. ఆక్సిజన్‌కు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో సిలిండర్ల తరలింపులో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల తరలింపు, నిల్వ, ఆసుపత్రుల్లో పైపుల ద్వారా రోగుల ఛాంబర్లకు సరఫరా, ఖాళీ అయిన సిలిండర్ల మార్పు తదితర పనులను చేయడంలో జాగ్రత్తలు లోపిస్తున్న పరిస్థితి. కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ సంస్థ డబ్ల్యు.హెచ్.ఏ. ఇంటర్నేషనల్ సిలిండర్ల వినియోగం నిల్వపై పలు సిఫారసులు చేసింది. ఈ సంస్థ అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు కూడా సేవలందిస్తోంది.

ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు..

1. సిలిండర్లు ఎల్లప్పుడు నిలువుగా ఉంచి స్టోర్ చేయాలి 2. సిలిండర్లకు వాల్వ్ రక్షణ క్యాప్ లు, వాల్వ్ అవుట్ లెట్ లకు సీల్ ఉండేలా చూడాలి 3. సిలిండర్లను నిర్ణీత ప్రదేశంలోనే స్టోర్ చేయాలి 4. ఖాళీ, ఆక్సిజన్ తో కూడిన సిలిండర్లను వేరు వేరుగా ఉంచాలి 5. నిల్వ ప్రదేశాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి 6. వాతావరణంలోని మార్పులతో ప్రభావితం కాని విధంగా ఈ ప్రదేశాలుండాలి 7. సిలిండర్లను మండే స్వభావమున్న మెటిరీయల్స్‌కు 20 అడుగుల దూరంగా, చల్లని, పొడి ప్రదేశాల్లో ఉంచాలి 8. ఇంధన గ్యాస్ సిలిండర్లకు 20 అడుగుల దూరంలో ఆక్సిజన్ సిలిండర్లను ఉంచాలి 9. సిలిండర్లలో వాయువును అత్యంత పీడనం(కంప్రెస్) తో నింపుతారు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించాల్సుంటుంది 10. వీటిని ఎత్తైన ప్రదేశం నుంచి జారవిడవడం, ఎత్తేయడం చేస్తే.. ఆక్సిజన్ వాయువు లీక్ అయి సిలిండర్లు రాకెట్ వలే పైకెగరి ప్రమాదాలు జరుగుతాయి 11. ఆక్సిజన్ వాయువు సొంతంగా మండిపోయే స్వభావం లేదు. కాని మండటానికి అక్సిజన్ అవసరం కాబట్టి మండే స్వభావమున్న ఇంధనం, గ్యాస్ తదితర మెటీరియల్స్‌కు దూరంగా ఉంచాలి 12. అనుభవమున్న, శిక్షణ పొందిన వారే సిలిండర్లను హ్యాండిల్ చేయాలి 13. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), రక్షణ గ్లాస్ లను ధరించాలి 14. చేతులకు, గ్లోవ్స్ కు ఎలాంటి ఆయిల్, గ్రీజ్ లాంటివి పూసుకోకూడదు 15. వాడే ముందు సిలిండర్ లేబుల్‌ను తప్పకుండా పరిశీలించాలి

రెండో దశలో…

సిలిండర్ ఉపయోగించడానికి ముందు వాల్వ్‌కు అమర్చిన రక్షణ క్యాప్ తొలించాలి. దానికి ఒకవేళ ప్లాస్టిక్ ర్యాపింగ్ ఉంటే దాన్ని పూర్తిగా తొలగించాలి. ఒక్క చిన్న ముక్క కూడా వాల్వ్ అవుట్ లెట్ వద్ద ఉండకూడదు. వాల్వ్ సరిగ్గా ఉందన్న విషయాన్ని చూసి నిర్ధారించుకోవాలి. ఒకవేళ వాల్వు వద్ద లీకేజ్, ఇతర పదార్థాలు పేరుకుపోయి ఉంటే సిలిండర్‌ను ఓపెన్ చేయకుండా తిరిగి వెండర్ (విక్రేత)కు వాపస్ చేయాలి. సిలిండర్ కు పక్కగా నిలబడి వాల్వును చిన్నగా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. అనంతరం వాల్వును మూసివేయాలి. ఓపెన్ చేసే, మూసివేసే సమయాల్లో వాల్వును నిర్ణీత పరిధి మేరకు పనిముట్లతో ఓపెన్, టైట్ చేయాల్సి ఉంటుంది. సిలిండర్‌ను వినియోగించడానికి వాయువు అవుట్ లెట్‌కు కనెక్షన్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో వాల్వును ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గేజ్ పరికరంతో.. వాయువు ఒత్తిడిని కొలవాలి. 25-100 పీఎస్ ఐ(170-700కేపీఎ) కంటె తక్కవగా ఉంటే సిలిండర్‌ను ఉపయోగించకూడదు. వాల్వును ఓపెన్ చేస్తున్న సమయంలో ఆక్సిజన్ లీక్ అవుతున్న శబ్ధం వస్తే.. వాల్వును వెంటనే మూసివేయాలి. ఈరకమైన పరిశీలనలు పూర్తయిన తర్వాత రెగ్యులేటర్ నుంచి ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేయాల్సి ఉంటుంది. నిర్ణీత పరిమాణంలో అవుట్ లెట్ నుంచి ఆక్సిజన్ సరఫరా పూర్తయిన తర్వాత వాల్వును మూయాల్సి వుంటుంది.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!