CM KCR: ప్రగతి భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా కట్టడిపై ఫోకస్ పెట్టిన సీఎం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!

దాదాపు రెండు వారాల తర్వాత ప్రగతి భవన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. కరోనా వచ్చి పూర్తిగా కోలుకున్న ఆయన హైదరాబాద్‌ వచ్చారు.

CM KCR: ప్రగతి భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా కట్టడిపై ఫోకస్ పెట్టిన సీఎం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
Cm Kcr
Follow us

|

Updated on: May 06, 2021 | 3:02 PM

CM KCR Corona Review: దాదాపు రెండు వారాల తర్వాత ప్రగతి భవన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. కరోనా వచ్చి పూర్తిగా కోలుకున్న ఆయన హైదరాబాద్‌ వచ్చారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కాసేపట్లో సమీక్ష చేసే అవకాశం ఉంది. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాజిటివ్‌ నిర్దారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవెల్లిలోనే ఉన్నారు. ఈ నెల 4వ తేదీ పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన రెండు వారాల గ్యాప్‌ తర్వాత ప్రగతి భవన్‌కు వచ్చారు.

ఇవాళ సాయంత్రం కరోనా వైరస్ పరిస్థితిపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన రాష్ట్రంలో వైరస్ కట్టడిపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఫీవర్ టెస్ట్ లు ,వ్యాక్సినెషన్ , లాక్ డౌన్ పై ఈ సమీక్షలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులతో కూడా కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లాల వారీగా కరోనా పరిస్థితిపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పటికే డీఎం అండ్ హెచ్ఓలకు టెలికాన్ఫరెన్స్‌లో డీహెచ్ మార్గదర్శకాలు జారీ చేశారు. మరికాసేపట్లో బీఆర్కే భవన్ లో డీహెచ్ శ్రీనివాస్ , డీఏంయి రమేష్ రెడ్డితో హెల్త్ సెక్రటరీ రిజ్వీతో సమావేశం కానున్నారు. సీఎంకు వివరించే అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూ సమయం కూడా పెంచాలని కోర్టు సర్కారుకు సూచించింది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని పేర్కొంది. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అడిగింది. రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు.

కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని, ప్రజల్లో అవగాహన రావాలని, హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ వైద్యుల సలహా మేరకు తుచ తప్పకుండా మందుల వాడటం వల్ల కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ కరోనాపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించడంతో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also… Covid Care: వీరికి కరోనా సోకే ప్రమాదం మరింత ఎక్కువ… హోం ఐసోలేషన్‏లో తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో తెలుసా..