South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..! 30 రైళ్లు తాత్కాలికంగా రద్దు..
South Central Railway : ఈ మధ్య కాలంలో రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లను పొడిగిస్తూ, మరికొన్ని రైళ్లను
South Central Railway : ఈ మధ్య కాలంలో రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లను పొడిగిస్తూ, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తోంది రైల్వే శాఖ. మరికొన్ని ప్రాంతాల్లో కరోనాతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కొన్ని రైలు సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. 30 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అందులో తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు (02708), సికింద్రాబాద్ నుంచి కర్నూల్ సిటికి నడిచే రైలు (07023), లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్లే రైలు (02776), లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే రైలు (02796), కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు (02762), సికింద్రాబాద్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ వెళ్లే రైలు (07233) ఇంకా మొదలగు ట్రైన్స్త్‌ని రద్దు చేశారు.
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్, దానాపూర్ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారాలు… అంటే ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో నాలుగు ట్రిప్పులు నడుస్తుంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారాలు అంటే… ఈ నెల 11, 18, 25, జూన్ 1న మొత్తం నాలుగు ట్రిప్పులు నడుస్తుంది. కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్-కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని, ఇవన్నీ రిజర్వేషన్ ట్రెయిన్లు అని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.