కరోనా రోగులు వీటిని తినడం మానుకోవాలి..! లేదంటే వ్యాధి తీవ్రత మరింత జఠిలమయ్యే ప్రమాదం..?
Corona Patients : కరోనా వైరస్ మన రోగనిరోధక వ్యవస్థకు హాని కలిగిస్తుందని మనందరికీ తెలుసు. దీనివల్ల బరువు తగ్గడం, బలహీనమవడం
Corona Patients : కరోనా వైరస్ మన రోగనిరోధక వ్యవస్థకు హాని కలిగిస్తుందని మనందరికీ తెలుసు. దీనివల్ల బరువు తగ్గడం, బలహీనమవడం జరుగుతుంది. ఈ సమయంలో మందులతో పాటు మీ ఆహారం పట్ల కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే విటమిన్లు, ఖనిజాలు, జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలంటున్నారు. ఈ రకమైన ఆహారం తినడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
మీరు కరోనా బారిన పడినట్లయితే మంచి ఆహారం తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు, వేయించిన, కాల్చిన ఆహార పదార్థాలు, ప్యాక్ చేసిన ఆహారం తినడం మానుకోవాలి. ఈ రకమైన ఆహారం తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మీకు ఆకలిగా ఉంటే ప్యాక్ చేసిన ఆహారం తినడం చాలా సులభం. కానీ కరోనా రోగికి ఈ రకమైన ఆహారం హానికరం. ఇందులో సోడియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఛాతిలో మంట సమస్యలు వస్తాయి. ఇది కాకుండా రోగనిరోధక శక్తి బలహీనంగా తయారవుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కారంగా ఉండే ఆహారం తినడం మానుకోవాలి. ఈ కారణంగా గొంతు నొప్పి, కఫం సమస్యలు ఉండవచ్చు. ఎర్ర మిరపకాయకు బదులుగా నల్ల మిరియాలు వాడండి. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కరోనా నుంచి కోలుకునే సమయంలో మీకు వేయించిన, కాల్చిన ఆహారాన్ని తినాలని ఉంటుంది. కానీ మీరు అలాంటి వాటిని తినకుండా ఉండాలి.
అధిక కొవ్వు ఉన్న ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచుతుంది. కరోనా నుంచి కోలుకునే సమయంలో ఎలాంటి చక్కెర పానీయాలు తీసుకోకూడదు. ఈ పానీయాలు తాగడం వల్ల శరీరానికి మంచిది కాదు. అలాగే కోలుకోవడం కూడా కష్టమవుతుంది. మీరు నిమ్మరసం తాగవచ్చు కానీ దానికి సోడా జోడించవద్దు.