నేపాల్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుతెన్నులు

ఇండియా పొరుగునున్న నేపాల్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రపంచ దేశాలను కోరుతున్నారు.

నేపాల్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుతెన్నులు
Covid Cases Increase In Nepal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 06, 2021 | 6:02 PM

ఇండియా పొరుగునున్న నేపాల్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రపంచ దేశాలను కోరుతున్నారు. ప్రతి లక్ష మందికి రోజువారీగా 20 కేసులు నమోదవుతున్నాయని గురువారం ఒక్కరోజే సుమారు 8 వేల కేసులు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. ఇటీవల 44 శాతం కోవిడ్ టెస్టులు పాజిటివ్ గా తేలాయని ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నేత్ర ప్రసాద్ టిమ్ సినా తెలిపారు. పొరుగునున్న ఇండియాలో ఉన్న పరిస్థితిని చూసే తాము ఆందోళన చెందుతున్నామని, ఇప్పడు తమ దేశంలో కూడా దాదాపు అలాంటి పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గత రెండో వారం నుంచి ఇక్కడ కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో ప్రతి లక్ష మందికి రోజువారీ కేసులు ఏడు రెట్లు పెరిగాయి. ఇండియాతో పోల్చినప్పుడు తమ దేశంలో పరిస్థితి మరీ అంత అధ్వాన్నం కాకపోయినా ఇది కోవిద్ సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇక్కడ హెల్త్ కేర్ సిస్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్దగా లేదు. పబ్లిక్ ఈవెంట్స్, ఫెస్టివల్స్, పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలమీద ఆంక్షలు లేవు. బహుశా ఇది కూడా కేసుల సంఖ్య పెరగడానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.

రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోందని, ముందు ముందు ఇది చెయ్యి దాటిపోవచ్చునని నేపాల్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి సమీర్ అధికారి అన్నారు. ఈ దేశంలో ఎంటర్ కావడానికిపాస్ పోర్టులు గానీ ఐడీ కార్డులు గానీ అవసరం లేదని, ఇక్కడ భారతీయులు తమ వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటున్నారని, అలాగే ఇండియాలో కూడా నేపాలీలు బిజినెస్ వంటి కార్యకలాపాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. ఏప్రిల్ 10 న నేపాల్ లోని భక్తాపూర్ లో జరిగిన పెద్ద జాతరకు లక్షలాది భక్తులు హాజరయ్యారు. కోవిడ్ ఆంక్షల ఊసేలేదు. కాగా గత నెల ఒక్కరోజే ఖాట్మండులో సుమారు 5 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ రాజధానిలో రెండు వారాలు లాక్ డౌన్ విధించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా భయం.. విటమిన్ ట్యాబ్లెట్లకు పెరిగిన డిమాండ్.. పండ్లు, కూరగాయలే బెస్ట్..

CM YS Jagan: కోవిడ్‌ పేషెంట్లకు పూర్తి ఉచిత వైద్య సేవలు.. అసవరమైన బెడ్లను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??