AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయం.. విటమిన్ ట్యాబ్లెట్లకు పెరిగిన డిమాండ్.. పండ్లు, కూరగాయలే బెస్ట్..

కరోనా ఇప్పటివరకు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇక ఈ మహమ్మారి సోకిందంటే ప్రాణాలు పోవడమే అని చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు.

కరోనా భయం.. విటమిన్ ట్యాబ్లెట్లకు పెరిగిన డిమాండ్.. పండ్లు, కూరగాయలే బెస్ట్..
Healthy Food
Rajitha Chanti
|

Updated on: May 06, 2021 | 5:54 PM

Share

కరోనా ఇప్పటివరకు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇక ఈ మహమ్మారి సోకిందంటే ప్రాణాలు పోవడమే అని చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. ఇక రోగ నిరోదక శక్తిని పెంచుకోవడం.. విటమిన్స్ ఎక్కువగా ఉంటే కరోనా సోకదని.. కోవిడ్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని మార్కెట్లో విచ్చలవిడిగా రకారకాల మందులను అమ్ముతున్నారు. దీంతో కరోనా భయంతో చాలా మంది డాక్టర్ల సూచనలు లేకుండా.. సోషల్ మీడియాను నమ్ముకొని ట్యాబెట్లు వాడుతున్నారు. గతంలో శానిటైజర్లు, ఎన్‌ 95 మాస్క్‌ల కోసం ఎగబడిన వారు నేడు వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్రలను ముందస్తుగానే కొంటున్నారు. దీంతో మార్కెట్లో కొన్ని రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. అంతే కాదు ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం చూసి కొందరు కరోనా సోకకుండా ఉండేందుకు ముందుగానే విటమిన్ సి, విటమిన్ డి, జింక్ మాత్రలను కొని ఇంట్లో భద్రం చేసుకుంటున్నారు.

ఇక జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని మందుల కంపెనీలు, వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. అలాగే విటమిన్ సి మాత్రలు విడివిడగా తీసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో పలు కంపెనీలు ఈ మాత్రలతోపాటు బి కాంప్లెక్స్, మరికొన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటూ ఆ కాంబినేషన్ డ్రగ్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో పది మాత్రల స్ట్రిప్ రూ.200 కు చేరింది. ఇవేకాకుండా.. మరికొందరు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కరోనా రాదని.. తమ కంపెనీ తయారు చేసిన మందులు వాడితే కరోనా 100 శాతం రాదని ప్రజల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో వెనక ముందు ఆలోచించకుండా ప్రజలు ఆ మందులను వాడుతున్నారు. అంతేకాదు ఉదయం నుంచి రాత్రి వరకు కషాయాలు, పసుపు, మిరియాలు కలిపిన పాలు, అల్లం సొంటి టీలు తాగుతున్నారు. ఇక రోజూకు రెండు మూడు సార్లు ఆవిరి పట్టుకుంటున్నారు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ మాత్రలను అవసరానికి మించి కొంటున్నారు. అలాగే వృద్ధులకు, రోగులే మందులు వేసుకోవాలని.. మాములుగా ఉండేవారు పండ్లు, కూరగాయలు తినడం ఉత్తమం. వీటిలో అధికంగా విటమిన్లు ఉంటాయి.

Also Read: మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

విక్రమ్ వేదకు ఏమైంది…? అడ్డంకులను దాటి రీమేక్ అయ్యేదెప్పుడు ? చిరు, నాగ్ కాంబో వచ్చేనా..