కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..
Weight Loss Tips: ప్రస్తుత పరిస్థితులలో బయటకు జాగింగ్ లేదా జిమ్స్ కు వెళ్లడం అసలు మంచిది కాదు. ఇక ఇంట్లోనే ఉండటం వలన బరువు పెరిగే అవకాశం లేకపోలేదు.
Weight Loss Tips: ప్రస్తుత పరిస్థితులలో బయటకు జాగింగ్ లేదా జిమ్స్ కు వెళ్లడం అసలు మంచిది కాదు. ఇక ఇంట్లోనే ఉండటం వలన బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక ఇన్నిరోజులుగా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఇంట్లోనే ఉండి.. కొన్ని రకాల డైట్ మెయింటెన్స్ చేస్తే సరిపోతుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి రోజూవారీ కేలరీలను తగ్గించుకోవడం మంచిది. అయితే రోజూ వారీ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మరీ ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోవాలో తెలుసుకుందమా..
చాలా మంది పండ్ల రసాలను తాగితేనే ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటుంటారు. అలా కాకుండా.. పండ్లను కట్ చేసుకోని తినడం వలన కూడా ఆరోగ్యంగా ఉంటారు. పండ్ల సేర్విన్గ్స్‌తో చక్కెర పండ్ల రసాలను మార్చుకోవడం ఆరోగ్యకరం. అలాగే కేలరీలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా.. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా తినడం వలన కేలరీలతోపాటు.. అనవసర బరువు పెరుగుతారు. వీటిని నియంత్రణలో ఉంచడానికి పండ్ల ముక్కలను తీసుకోవడం ఉత్తమం. వీటి వలన కొన్ని కిలోల బరువు తగ్గడమే కాకుండా.. కేలరీలు తగ్గుతాయి.
భోజన సమయానికి కొన్ని గంటల మధ్య మీకు ఎక్కువగా ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఎదో ఒక పదార్థాలను తింటూనే ఉంటారు. దీంతో మీ శరీరంలో అధిక క్యాలరీలు పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే ఎక్కువగా నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వలన ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువగా ఆకలిగా ఉండడం బరువు తగ్గడానికి సహయపడుతుంది. అలాగే మీకు తినాలనే కోరికను నియంత్రించుకోవాలి. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మొలకెత్తిన గింజలు, రొట్టె, ఇతర పిండి పదార్థాలను తీసుకోవడంతోపాటు టీస్పూన్ దాల్చిన చెక్కను జతచేయడం మంచిది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఆకలిని తగ్గించడమే ఇన్సులిన్ పెరుగుదలను నియంత్రిస్తుంది.
Also Read: Covid Care: బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్నవారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా..