అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!

Boost Your Immunity Power: పోషకాహారం తీసుకుంటే… కరోనా సోకినా ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చు. ప్రపంచంలో..

అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినడం చాలా అవసరం.! ఒక్కసారి ట్రై చేయండి.!!
Diet Foods
Ravi Kiran

|

May 05, 2021 | 6:47 PM

Boost Your Immunity Power: పోషకాహారం తీసుకుంటే… కరోనా సోకినా ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చు. ప్రపంచంలో 200 రకాల వైరస్‌లు ఉండగా వాటిలో ఒకటి కరోనా వైరస్. ఈ వైరస్ సోకినవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేవారు దీన్ని జయిస్తున్నారు. మరి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఏం తాగాలి అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. తద్వారా క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్ లు ఓ లిస్టు రెడీ చేశారు. ఆ లిస్టులో ఉన్న వాటిని ప్రతి రోజు తింటే కరోనా వైరస్ సోకినా బాడీలోని ఇమ్యూనిటీ పవర్ దాన్ని ఎదిరించగలదని చెబుతున్నారు. అందుకే ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 98 మంది వైరస్‌ని జయిస్తున్నారు. దానికి కారణం పోషకవిలువలున్న ఫుడ్ తీసుకోవడమే.

టమాటాలు, క్యారెట్, బీట్‌రూట్, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, వంకాయ, కాప్సికం వంటివి తినాలి. కమలాలు, పైనాపిల్, బొప్పాయి, కివి, జామకాయ, బెర్రీ పండ్లు తినడం మంచిది. రాత్రి నీటిలో నానబెట్టిన బాదం పప్పులు, వాల్‌నట్స్ ఉదయాన్నే తీసుకోవాలి. గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ, పసుపు టీ మంచివి. అలాగే మంచినీరు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్‌లు, పాలు, మజ్జిగ వంటివి కలిపి రోజూ రెండున్నర నుంచి 3 లీటర్ల వరకు ద్రవాలు తీసుకోవాలని క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్ లు సూచిస్తున్నారు. ఈ ఫుడ్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే… కరోనా వైరస్ తో పోరాడే బలం మీ సొంతమవుతుందని అంటున్నారు.

Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu