మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి

మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు
Surekha Vani

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందింది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ఆమె యాక్టివ్‏గానే ఉంటుంది. ఇక సురేఖా వాణితోపాటు.. ఆమె కూతురు సుప్రితకు కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక వీరిద్ధరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏ రేంజ్‏లో వైరల్ అవుతుంటాయో అందరికి తెలిసిన విషయమే. ఇక సురేఖా వాణి భర్త మరణం తర్వాత ఆమె గురించి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అన్ని ఇన్ని కావు. ఒకానోక సమయంలో ఆమె గురించి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఇటీవల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సందర్భంగా సురేఖా కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాలపై సురేఖా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు… తన భర్తకు అనారోగ్యం అని.. చనిపోయిన సమయంలో ఎవ్వరూ తమకు అండగా నిలవలేదని సురేఖా చెప్పారు.

Supritha

Supritha

ఇదిలా ఉంటే నేడు (మే 6) సురేఖా వాణి భర్త చనిపోయిన రోజు. ఇప్పటికీ ఆమె కూతురు సుప్రిత తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతుంటారు. సమయం వచ్చినప్పుడల్లా.. తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈరోజు మరోసారి తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు సుప్రిత. తండ్రి చనిపోయినా కూడా.. ఇంకా ఆమె తన ఫోన్‌లో నాన్న అనే నంబర్‌ను అలానే సేవ్ చేసుకుని ఉన్నారు. ఆ నంబర్‌ను, ఆ కాంటాక్ట్‌ను అలానే ఇంకా పదిలపర్చుకున్నారు…. ఈ క్రమంలోనే తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ‘కొన్ని సార్లు మనం వారి మాటలను వినలేం.. వారి నుంచి ఫోన్ కూడా రాదు.. కానీ దాన్నే మనం ప్రేమ అంటాం.. ఐ మిస్ యూ నాన్న… నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఇప్పటికీ నువ్ మా చుట్టూనే ఉన్నావనిపిస్తోంది.. నువ్ మమ్మల్ని వదిలి వెళ్లి రెండేళ్లు అవుతుందంటే నమ్మలేకపోతోన్నాను.. ఐ మిస్ యూ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని సుప్రిత ట్వీట్ చేశారు.

Also Read: రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..