అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..

బిగ్‏బాస్ రియాల్టీ షో.. ఇందులో పాల్గోన్న వారు ఒక్కసారిగా క్రేజ్ సంపాధించుకున్నారు. ఇక ఇందులో లవ్ ట్రాక్ నడిపిన జంటలకు సోషల్ మీడియాలో

అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..
Rahul Sipligunj Ashu Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2021 | 6:16 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో.. ఇందులో పాల్గోన్న వారు ఒక్కసారిగా క్రేజ్ సంపాధించుకున్నారు. ఇక ఇందులో లవ్ ట్రాక్ నడిపిన జంటలకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సీజన్ మొదటి నుంచి ఈ షోలో లవ్ ట్రాక్స్ నడుస్తూనే ఉంటాయి. సీజన్ సీజన్ కు జంటలు మారవచ్చునేమో కానీ.. టాపిక్ మాత్రం మారదు. ఇక ఈ జంటలను స్క్రీన్ పై చూపించే టైమింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ కూడా ఒకటి. షోలో ఉన్నంతసేపు.. పునర్వవితో రాహుల్ క్లోజ్ గా ఉండేవాడు. దీంతో షో తర్వాత వీరిద్ధరు మ్యారెజ్ చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తెరపైకి అషు రెడ్డి వచ్చింది. రాహుల్, అషు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారేమో అనుకున్నారంతా.

ఇటీవల రాహుల్ అషురెడ్డిని ఎత్తుకున్న ఫోటో నెట్టింట్లో వైరల్ కావడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. దీంతో వీరిద్ధరూ నిజాంగానే ప్రేమలో ఉన్నారనుకున్నారు. తాజాగా రాహుల్ ఈ విషయాలపై ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్య్వూలో అషుతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకోచ్చాడు రాహుల్. తనకు అషు.. చాలా స్పెషల్ అని.. తనపై అషు చూపించే కేరింగ్ చాలా ఇష్టమని చెప్పుకోచ్చాడు. కానీ తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమి లేదని.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అషుతో రిలేషన్ గురించిన క్లారిటీ ఇచ్చేశాడు రాహుల్. అయితే ఆయన చేసిన ఈ కామెంట్స్ చూసి అషురెడ్డి రియాక్ట్ అయింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోని మెన్షన్ చేస్తూ ‘థాంక్యూ రాహుల్.. నాకు ఏడుపొచ్చేస్తోంది.. నువ్వు ఎప్పటికీ స్పెషల్’ అంటూ లవ్ సింబల్ ట్యాగ్ చేసింది.

Also Read: గరిటపట్టిన బన్నీ డాటర్.. నాన్న కోసం స్పెషల్‏గా దోశ వేసిన అర్హ.. ఎప్పటికీ మర్చిపోలేనంటున్న అల్లు అర్జున్..

రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..