గరిటపట్టిన బన్నీ డాటర్.. నాన్న కోసం స్పెషల్‏గా దోశ వేసిన అర్హ.. ఎప్పటికీ మర్చిపోలేనంటున్న అల్లు అర్జున్..

Allu Arjun: అల్లు అర్జున్.. ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం క్యారంటైన్‏లో ఉన్నారు. ఇటీవలే తన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని..

గరిటపట్టిన బన్నీ డాటర్.. నాన్న కోసం స్పెషల్‏గా దోశ వేసిన అర్హ.. ఎప్పటికీ మర్చిపోలేనంటున్న అల్లు అర్జున్..
Allu Arjun Arha

Allu Arjun: అల్లు అర్జున్.. ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం క్యారంటైన్‏లో ఉన్నారు. ఇటీవలే తన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని.. ఇంకా క్యారంటైన్‏లోనే ఉన్నాని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఫ్యాన్స్ కంగారు పడవద్దని.. తనపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ తన ఇన్‏స్టాగ్రామ్ లో మరో వీడియోను షేర్ చేశారు. అందులో బన్నీ డాటర్ గరిటపట్టి వంట చేసేస్తుంది. వంటింట్లోకి వెళ్ళి మరీ అల్లు అర్జున్ కోసం దోశలు వేశారు. ఇక అర్హ దోశలు వేసే వీడియోను షేర్ చేస్తూ.. దోశ వేయడం బాహుషా నా దగ్గరే నెర్చుకుని ఉంటుందని రాములో రాముల స్టెప్పులను గుర్తు చేసుకున్నారు బన్నీ. గతంలో బన్నీ.. నటించిన అల.. వైకుంఠపురంలో సినిమాలోని రాములో రాములో సాంగ్ స్టె్ప్పులను దోశ స్టెప్పులంటూ అర్హ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అర్హ తన కోసం దోశ వేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ బన్నీ తెగ సంబరపడిపోయారు.

Arha

ఇక కరోనా వచ్చిన తర్వాత బన్నీ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి ఆడుకోవడం, అందరూ ఒకేచోట ఉండడం.. అందరూ ఆడుకుంటే ఆ వీడియోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవి నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలా బన్నీ తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండటంతో కరోనా తగ్గి ఉంటుందని అందరూ అనుకున్నారు. వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు బన్నీ పోస్ట్ చేశారు. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తుండగా.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా కొనసాగింది. ఇక ఈ సినిమా చిత్రీకరణలోనే బన్నీ కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ కు కాస్తా బ్రేక్ వచ్చింది.

Also Read: రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..