AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..

Venkatesh: రీమేక్‏లను నమ్ముకుంటే సేఫ్ జోన్‏లో ఉన్నట్టే. బాక్సాఫీస్ బద్దలయ్యే కాసుల వర్షాన్ని కాసేపు పక్కనపెడితే.. నష్టమైతే రాదన్న నమ్మకం ఉంటుంది.

పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: May 05, 2021 | 3:01 PM

Share

Venkatesh: రీమేక్‏లను నమ్ముకుంటే సేఫ్ జోన్‏లో ఉన్నట్టే. బాక్సాఫీస్ బద్దలయ్యే కాసుల వర్షాన్ని కాసేపు పక్కనపెడితే.. నష్టమైతే రాదన్న నమ్మకం ఉంటుంది. ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్నట్లు తెలుస్తోంది విక్టరీ వెంకటేశ్.. ఇప్పటివరకు వెంకీ తన కెరీర్‏లో చాలానే హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు రీమేక్‏లను పట్టాలెక్కించిన వెంకీ.. నెక్ట్స్ ఫిల్మ్ కూడా మాలీవుడ్ నుంచి అరువు తెచ్చుకుంటున్నాడట. ప్రస్తుతం ఫ్యామిలీ హీరో వెంకటేశ్.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం‏లో ఎఫ్ 3 చేస్తుండగా.. దృశ్యం 2, నారప్ప చిత్రాలు చివరిదశకు వచ్చాయి. వీటిలో ఎఫ్3 తప్ప.. మిగతా రెండు సినిమాలు.. రీమేక్‏లే. అయితే ఇప్పుడాయన మరో క్రేజీ ప్రాజెక్ట్ రీమేక్‏కు సిద్ధమవుతున్నట్లు.. టాలీవుడ్ టాక్.

మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని.. కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా పవన్ కల్యాణ్‏తో.. రామ్ చరణ్ ఈ సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ కథనాలు అవాస్తవం అని తేల్చిచెప్పాయి సినీ వర్గాలు. దీంతో ఈ మూవీ ఎవరు పట్టాలెక్కిస్తారనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. అయితే డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ హక్కులు.. సురేశ్ ప్రొడక్షన్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని.. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో వెంకీ పక్కన నటించనున్న మరో హీరో ఎవరన్న ఆసక్తి అప్పుడే మొదలైంది. వెంకటేశ్‏తో ఇటీవల వరుణ్ తేజ్ తో ఎఫ్3 సిరీస్ చేస్తుండగా.. ఈ రీమేక్ లో రానాకు అవకాశం దక్కుతుందనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారట మేకర్స్. మరీ చూడాలి.. ఈసారి వెంకీ పక్కన నటించే స్టార్ ఎవరో.

Also Read: పూరీని వేడుకుంటున్న విజయ్ ఫ్యాన్స్.. అప్‏డేట్ కాకపోయినా లుక్ అయినా విడుదల చేయాలంటూ విజ్ఞప్తి..

వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..

జర్నలిస్ట్‌గా మారనున్న అవికాగోర్.. రియల్ లైఫ్ ? లేదా రీల్ లైఫ్ అంటూ .. సందేహంలో ఫ్యాన్స్..