పూరీని వేడుకుంటున్న విజయ్ ఫ్యాన్స్.. అప్‏డేట్ కాకపోయినా లుక్ అయినా విడుదల చేయాలంటూ విజ్ఞప్తి..

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ.. లైగర్. లయన్, టైగర్ ను

  • Rajitha Chanti
  • Publish Date - 2:38 pm, Wed, 5 May 21
పూరీని వేడుకుంటున్న విజయ్ ఫ్యాన్స్.. అప్‏డేట్ కాకపోయినా లుక్ అయినా విడుదల చేయాలంటూ విజ్ఞప్తి..
Vijay Devarakonda

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ.. లైగర్. లయన్, టైగర్ ను కలిపి చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ తోనే.. రౌడీ ఫ్యాన్స్ లో క్రేజ్ పెంచింది మూవీ యూనిట్. అయితే ఈ మూవీ అప్ డేట్స్ కోసం.. ఫ్యాన్స్ వేయిట్ చేయలేకపోతున్నారట. కనీసం విజయ్ లుక్ నైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో సెపరేట్‏గా చెప్పక్కర్లేదు. అందుకే తనను తాను రౌడీగా చెప్పుకుంటాడీ అర్జున్ రెడ్డి. ప్రస్తుతం పూరీ డైరెక్షన్ లో లైగర్ మూవీ చేస్తున్నాడు. లయన్, టైగర్ క్రాస్ బ్రీడింగ్ అంటూ ఓ పోస్టర్‏ను కూడా విడుదల చేసిన యూనిట్.. ఇక ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. పూరీ సారథ్యంలో చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ లో.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తుండగా.. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక అనన్య ఈ సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుంది. Liger Movie Update

అయితే చాలాకాలం నుంచి విజయ్ నుంచి మూవీ రాకపోవడంతో.. ఫ్యాన్స్ వెయిట్ చేయలేకపోతున్నారట. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత.. మళ్లీ విజయ్.. ఇంతవరకు స్క్రీన్ పై కనిపించలేదు. గతేడాది మార్చ్‏లో లైగర్ షూటింగ్ ప్రారంభమైనా.. ఇప్పటివరకు చిత్రీకరణ పూర్తవలేదు. కరోనా కారణంగా.. ఏడాది కాలంగా.. నిర్మాణ పనులు సజావుగా సాగడం లేదు. యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్‏తో పాటు.. ఫైటర్స్ కూడా అవసరం పడటంతో.. షూట్ ముందుకు వెళ్లడం లేదు. దీంతో లైగర్ ఎప్పుడొస్తుందనేది ఎవరూ చెప్పడం లేదు. దీంతో ఫ్యాన్స్ మాత్రం.. సోషల్ మీడియా వేదికగా.. లైగర్ అప్ డేట్స్ కావాలని పట్టుబడుతున్నారట. కనీసం విజయ్ లుక్ అయినా బయటపెట్టాలని.. డిమాండ్ చేస్తున్నారట. పోస్టర్ లేదా ఓ సాంగ్ అయినా విడుదల చేయాలని.. కోరుతున్నారట. మరీ చూడాలి ఫ్యాన్స్ కోరికను పూరీ నెరవేరుస్తాడా ? లేదా ? అనేది.

Also Read: జర్నలిస్ట్‌గా మారనున్న అవికాగోర్.. రియల్ లైఫ్ ? లేదా రీల్ లైఫ్ అంటూ .. సందేహంలో ఫ్యాన్స్..

వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న యంగ్ హీరో.. రచయిత కమ్ డైరెక్టర్ సినిమాలో నితిన్..