పుచ్చకాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు..

Watermelon Benefits : పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. వేసవిలో ఈ పండు తినడం

పుచ్చకాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు..
Watermelon
Follow us
uppula Raju

|

Updated on: May 06, 2021 | 10:20 PM

Watermelon Benefits : పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. వేసవిలో ఈ పండు తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. చాలా శక్తి వస్తుంది. పుచ్చకాయలో పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్లు బి 1, బి 6, సి, డి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. కనుక ఈ పండు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ కొన్ని విషయాలు తినడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పుచ్చకాయ ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి ప్రయోజనాలు..

1. పుచ్చకాయలోని కేలరీలు, కొవ్వు సమానంగా ఉంటుంది. నీరు 92 శాతం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 2. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ బి 6 ఐరన్ ఎర్ర రక్త కణాలను పెంచుతాయి. ప్రతిరోధకాలను తయారు చేయడంలో కూడా సహాయపడతాయి. 3. పుచ్చకాయ జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. అందులో లభించే 92 శాతం నీరు మలబద్ధకం సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. 4. పుచ్చకాయ ఎల్‌డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్త నాళాలలో కొవ్వు నిల్వలు రాకుండా చేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయ తినడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..

1. ఒక రోజులో 400-500 గ్రాముల పుచ్చకాయను తీసుకుంటే సరిపోతుంది. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. అలాగే లూస్ మోషన్, గ్యాస్, అపానవాయువు, విరేచనాలు వంటి సమస్యలు ఉండవచ్చు. 2. పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఈ పండ్లలో అప్పటికే చాలా నీరు, ఫ్రక్టోజ్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. 3. రాత్రికి పుచ్చకాయ తింటే బరువును పెంచుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. 4. రోజూ తాగే వారు పుచ్చకాయ తినకూడదు. వారు కాలేయ మంట గురించి ఫిర్యాదు చేయవచ్చు. 5. డయాబెటిస్ రోగులు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి లేదా శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.

టీమిండియా క్రికెటర్ ఇంట్లో వరుస విషాదాలు.. కరోనాతో మొన్న అమ్మ.. నేడు అక్క.. ఎమోషనల్ ట్వీట్..

కరోనా వ్యాక్సిన్‌ పేటెంట్‌పై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన టెడ్రోస్