టైప్ 2 డయాబెటిస్‌ రోగులకు వేపనీరు దివ్యఔషధం..! పరగడుపున సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..

Neem Health Benefits : ఆయుర్వేదంలో వేపకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. వేప చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలు, బెరడును ఔషధంగా

టైప్ 2 డయాబెటిస్‌ రోగులకు వేపనీరు దివ్యఔషధం..! పరగడుపున సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..
Neem Water

Neem Health Benefits : ఆయుర్వేదంలో వేపకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. వేప చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిన తర్వాత ఈ ఆకులను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు.

కరోనా కాలంలో ఊబకాయం, అధిక బీపీతో డయాబెటిస్ రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో వీరు వేప ఆకుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. డయాబెటిస్ రోగులు చాలా మందులు తీసుకుంటారు. కానీ దాని నుంచి అనేక రకాల దుష్ప్రభావాలు సంభవిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు డయాబెటిస్‌ను కూడా సహజమైన రీతిలో చికిత్స చేయవచ్చు. వేప ఆకులు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

డయాబెటిస్ కారణంగా శరీరంలో అలసట, శక్తి లేకపోవడం, స్ట్రోక్, గుండె, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతాయి. డయాబెటిస్ విషయంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆయుర్వేదంలో వేపను ఆరోగ్యకరమైన మూలికగా భావిస్తారు. ఇది బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ అనేక వ్యాధుల నుంచి రక్షించే లక్షణాలను కలిగి ఉంటుంది.

వేప తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు, ముఖ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వారికి వేప వాడకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వేప గ్లూకోజ్ స్థాయిలను నిర్వహిస్తుంది. దీనివల్ల చర్మం మెరుస్తుంది. వేపను తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.

మీరు ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలవచ్చు. వేప నీరు తాగవచ్చు. వేప ఆకుల నీటిని తయారు చేయడానికి మీరు 15 నుంచి 20 ఆకులను తీసుకొని అర లీటరు నీటిని కలిపి 5 నిమిషాలు ఉడకబెట్టండి. కొంత సమయం తరువాత నీరు ఆకుపచ్చగా మారుతుంది అలాగే ఆకులు మృదువుగా మారుతాయి. తరువాత మీరు ఈ నీటిని తాగవచ్చు.

ధోని మైదానంలోనే కాదు బయట కూడా కెప్టెనే..! ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా అలాగే అంటారు..

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..

పుచ్చకాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..! లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు.