AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఆస్తిపరంగా ఉన్న వివాదాలు కాస్త సమసిపోయే అవకాశాలు…

మనిషి తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. రాశిఫలాలు భవిష్యత్తును అంచనా వేయడానికి ఓ మార్గంగా ఉపయోగపడుతుంది.

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు ఆస్తిపరంగా ఉన్న వివాదాలు కాస్త సమసిపోయే అవకాశాలు...
Rajeev Rayala
|

Updated on: May 07, 2021 | 6:52 AM

Share

Horoscope Today: మనిషి తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు. రాశిఫలాలు భవిష్యత్తును అంచనా వేయడానికి ఓ మార్గంగా ఉపయోగపడుతుంది. వీటి ఆధారంగా.. చేసే పనులను కొనసాగించాలా.? వాయిదా వేయాలా? అన్న నిర్ణయాలు తీసుకునే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి..

మేషరాశి..

ఈ రాశి వారు ఈరోజు వృత్తి పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించినట్లైతే లాభాలు పొందే అవకాశం ఉంది. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచింది.

వృషభ రాశి..

వృషభ రాశివారికి ఈరోజు ఆస్తి  పరంగా ఉన్న వివాదాలు కాస్త సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు అధిగమించుకునే అవకాశం ఉంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపుతూ ఉండాలి.

కర్కాటక రాశి

వారికి ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణలు వాయిదా వేసుకునే విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

సింహరాశి..

ఈ రాశివారు  తీసుకునే నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. చిన్న చిన్న వివాదాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటారు.

కన్య రాశి..

కన్య రాశివారికి ఈరోజు కొన్ని అనుకోని ప్రయాణాలు చేయడం, ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు. శ్రీరాముని నమ స్మరణ మంచింది.

తులరాశి..

ఈ రాశివారు ఈరోజు వ్యాపారాలను విస్తరించే ఆలోచనలు చేస్తుంటారు తామర పుష్పాలతో మహాలక్ష్మీ అమ్మవారి అర్చన చేయడం మంచింది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో కొంత వేగం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. విశేష శ్రీరామ పూజ మేలు చేస్తుంది.  .

ధనుస్సు రాశి..

ఈ రాశివారు వ్యాపార విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుకోవాల్సి ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు.

మకర రాశి..

మకర రాశి వారు ఈరోజు రావలసిన బాకీలు వాసులు చేసుకుంటారు. దేవాలయాలకు ఆర్ధికంగా సహకరించే ప్రయత్నం చేయండి.

కుంభరాశి..

ఈ రాశివారు ఈరోజు వేరువేరు రూపాలలో అనారోగ్య సంబంధమైన భవనాలు తగ్గించుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. దుర్గ అమ్మవారి పూజ మేలు చేస్తుంది.

మీన రాశి..

మీన రాశి వారికి వృత్తిపరమైన ఆటంకాలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. లక్ష్మి నరసింహ స్వామి వారి నామస్మరణ మీ;లు చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మార్కెట్‌ నిపుణుల మాటలు నిజం కానున్నాయా..? తాజా ధరల వివరాలు

Fake Vaccination Link: వ్యాక్సినేష‌న్ పేరుతో న‌కిలీ లింక్‌లు.. క్లిక్ చేశారో అంతే సంగ‌తులు..