AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు వివాదాలు తలెత్త అవకాశాలు ఎక్కువ.. శుభ ఫలితాలు పొందేందుకు ఏం చేయాలి

Horoscope Today: రాశిఫలాలు జీవితంలో జరిగే విషయాలను నిర్దేశిస్తాయని నమ్మేవారు చాలామందే ఉంటారు. వివిధ రాశుల వారు ఈ రోజు వారి జాతకం ఎలా ఉంటుందనే దానిపై వా..

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు వివాదాలు తలెత్త అవకాశాలు ఎక్కువ.. శుభ ఫలితాలు పొందేందుకు ఏం చేయాలి
Subhash Goud
|

Updated on: May 06, 2021 | 7:10 AM

Share

Horoscope Today: రాశిఫలాలు జీవితంలో జరిగే విషయాలను నిర్దేశిస్తాయని నమ్మేవారు చాలామందే ఉంటారు. వివిధ రాశుల వారు ఈ రోజు వారి జాతకం ఎలా ఉంటుందనే దానిపై వారు ఎక్కువ శ్రద్ద చూపుతుంటారు. జాతకం ప్రకారం.. ఏ దేవున్ని పూజిస్తే మంచిది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనే అంశాలను దృష్టి సారిస్తుంటారు. మరి ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..

ఈ మేషరాశి

ఈ రోజు మేషరాశి వారికి పారిశ్రామిక రంగంలో, ఇతర రంగాల్లో అనుకూలమైన ప్రయోజనాలు ఉంటాయి. జాగ్రత్తగా ముందుకు వెళితే ఫలితం ఉంటుంది. ఈ రాశివారు రాజశ్రీ అమ్మవార్ల నామస్మరణ చేస్తే బాగుంటుంది.

వృషభరాశి

ఈ రాశిగలవారికి వ్యక్తిగత భూసంబంధమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీరు లలిత అమ్మవారి దర్శనం, నామస్మరణ మేలు చేస్తుంది.

మిథునరాశి

ఈ రాశివారికి వ్యక్తిగత ఆదాయ విషయంలో ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులను తగ్గించుకుంటే ఎంతో మంచిది. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం ఎంతో మేలు చేస్తుంది.

కర్కాటకరాశి

ఈ రాశివారికి ఈ రోజు వ్యక్తిగత పనుల్లో కొంత వివాదాలు నెలకొని ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించాలి. గౌరి పూజ శుభ ఫలితాలను కలుగజేస్తుంది.

సింహరాశి

వీరికి ఉద్యోగానికి సంబంధించిన పనులలో, ఇతర అంశాలలో సాధారణ ఫలితాలు పొందుతుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలను అధిగమించుకోగల్గుతారు. అన్నదానం ఎంతో మేలు చేస్తుంటుంది.

కన్యరాశి

ఈ రాశివారు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. రాబోయే బాకీల వసూలు విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. గణపతి నామస్మరణ మేలు చేస్తుంటుంది.

తులారాశి

ఈ రాశివారికి ఈ రోజు వ్యాపార విషయంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. మరిన్ని ఫలితాల కోసం నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.

వృశ్చికరాశి

ఈ రాశివారు ఈ రోజు వ్యాపార రంగంలో, ఇతర అంశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటారు. కొన్ని విలువైన భావాలను కోల్పోతూ ఉంటారు. ఈ సమయంలో కార్తి విర్యార్జున నామస్మరణ చేసుకోవడం మంచిది.

ధనుస్సురాశి

ఈ రాశివారు ఈ రోజు ధార్మికంగా బలపడే పనులను చేస్తుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల విషయాలలో శ్రద్ద చూపడం మంచిది. సుబ్రహమణ్య స్వామి ఆధాధన మేలు చేస్తుంటుంది.

మకరరాశి

ఈ రాశివారు ఈ రోజు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. ప్రయాణ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లలితా పారాయణం మేలు చేస్తుంటుంది.

కుంభరాశి

ఈ రాశివారు ఈ రోజు కొన్ని శుభ ఫలితాలు పొందుతుంటారు. ఉద్యోగ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆంజనేస్వామి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంటుంది.

మీనరాశి

అనుకున్న సమయానికి ఆదాయ మార్గాలను సద్దుబాటు చేసుకోలేకపోతారు. కొంత ఇబ్బందులు ఉంటాయి. అష్టలక్ష్మి పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

Aslo Read: పండ్లు మంచివా పండ్ల రసాలు మంచివా..? శరీరానికి ఏ రూపంలో తీసుకుంటే బెటర్..! తెలుసుకోండి..

Follow Us
మొన్న భారీ విధ్వంసం.. కట్‌చేస్తే.. జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్..!
మొన్న భారీ విధ్వంసం.. కట్‌చేస్తే.. జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్..!
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?
అబ్బబ్బా.. బొచ్చ చేపతో పులసు ఇలా పెట్టారంటే..?
విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..
విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు..
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు