పండ్లు మంచివా పండ్ల రసాలు మంచివా..? శరీరానికి ఏ రూపంలో తీసుకుంటే బెటర్..! తెలుసుకోండి..
Fruits and Fruit Juices : మనిషి మనుగడకు అవసరమయ్యే ఆహారం మట్టి, చెట్టు నుంచి పుట్టిందే.. ఆకులు అలమలు, పండ్లు, కాయలు,
Fruits and Fruit Juices : మనిషి మనుగడకు అవసరమయ్యే ఆహారం మట్టి, చెట్టు నుంచి పుట్టిందే.. ఆకులు అలమలు, పండ్లు, కాయలు, పంటలు, దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు… ఇలా అన్నీ నేలతల్లి ప్రసాదించిన వరాలే! అందులో ముఖ్యమైనవి పండ్లు. ఒక్కో ఫలానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే పండ్లను ఏ విధంగా తినాలి.. పండ్లు తింటే మంచివా పండ్ల రసాలు తాగితే మంచిదా ఈ రోజు తెలుసుకుందాం..
అవకాశం ఉన్నంత వరకు పండును పండులా మొత్తంగా తింటేనే అది అందించే పోషకాల పూర్తీ ప్రయోజనాన్ని పొందవచ్చు. తొక్కతో సహా తినే పండ్లను పదిహేను నిమిషాల పాటు ఉప్పునీటిలో నానబెట్టి, ఆ తరువాత మంచినీళ్లలో కడిగి తినాలి. అప్పుడు పండ్ల మీదున్న రసాయనాలు, సూక్ష్మజీవులు తొలగిపోతాయి. కానీ పండ్లను కోసి, ముక్కలను కడిగి తింటే సంపూర్ణ ప్రయోజనం పొందలేరు. పండ్లను ఆహారంలో భాగం చేసుకునే ప్రయత్నంలో కొందరు వాటి రసాలను తాగేందుకే ఇష్టపడతారు. అది మంచిది కాదు.
పండ్ల రసాలు పైకి ఆరోగ్యంగా కనిపించినా వాటిలో పోషకాల కంటే చక్కెరలే ఎక్కువ. సూపర్‌మార్కెట్లలో దొరికే ప్యాకేజీ పండ్ల రసాలలో అయితే చక్కెరలు చాలా అధిక మోతాదులో ఉంటాయన్నది గుర్తించాలి. అందుకే ఆ కృత్రిమ పానీయాలు అనారోగ్యకరం. పండ్ల రసాల దుకాణాల్లో జ్యూస్‌లు తాగినా లాభం అంతంతమాత్రమే. జ్యూస్ తయారీ ప్రక్రియలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, లవణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. తాజాపండ్లు తింటే బరువు తగ్గుతారు, అదే పండ్ల రసాలు తాగితే బరువు పెరుగుతారు. ఎందుకంటే అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి.