పొలంలో అడ్డుగా ఉందని రాయిని జరిపిన రైతు.. తెలియకుండానే పెద్ద పొరపాటు చేశాడు.. చివరకు..

ఒక రైతు తెలియకుండా చేసిన పొరపాటుతో తమ దేశం మరింత పెద్దగా మారింది. అదేంటీ అసలు అర్థం కావడం లేదు కదా.. అసలు విషయం ఎంటంటే..

  • Rajitha Chanti
  • Publish Date - 4:21 pm, Wed, 5 May 21
పొలంలో అడ్డుగా ఉందని రాయిని జరిపిన రైతు.. తెలియకుండానే పెద్ద పొరపాటు చేశాడు.. చివరకు..
French Border

ఒక రైతు తెలియకుండా చేసిన పొరపాటుతో తమ దేశం మరింత పెద్దగా మారింది. అదేంటీ అసలు అర్థం కావడం లేదు కదా.. అసలు విషయం ఎంటంటే.. బ్రెజిల్‏కు చెందిన ఒక రైతు ట్రాక్టర్‏తో తన పొలం పనులు చేసుకోవడానికి ఎప్పుడు అడ్డుగా ఓ రాయి వస్తుండేది. దీంతో అతనికి దానిపై కోపం వచ్చింది. ఆ రాయి ఏంటీ ? అదెందుకు అక్కడ ఉంది ? అన్నదేమి ఆలోచించకుండా 2.25 మీటర్లు వెనక్కు జరిపాడు. ఇక ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రెండు రోజుల తర్వాత కొందరు చరిత్రకారులు అటువైపు వచ్చారు. 1819లో పాతిన ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు సంబంధించిన ఆ సరిహద్దు రాయి ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వెనక్కు ఫ్రాన్స్ భూభాగంలోకి జరిగి ఉండటాన్ని గమనించారు.

ఇక ఇదే విషయంపై ఓ చరిత్రకారుడు డేవిడ్ లావాక్స్ మాట్లాడుతూ… ఆ రైతు తెలియకుండా రాయిని జరపటం ద్వారా బెల్జియం పెద్దదిగా మారింది. ఇక అదే సమయంలో ఫ్రాన్స్ చిన్నదైంది. నాకు సంతోషం వేసింది. ఎందుకంటే మా టౌన్ పెద్దదైంది కాబట్టి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఫ్రాన్స్ లోని భౌసిగ్నీస్ మేయర్ సర్ రాక్ దీనికి ఒప్పుకోలేదు. అందుకే దాన్ని మళ్లీ అదే స్థానంలో పెట్టడానికి నిర్ణయించాము అని అన్నారు. అయితే ఆ రైతు చేసిన పనికి రెండు దేశాల మధ్య గొడవ జరిగి ఉండేది. కానీ ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండడంతో అక్కడి అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. స్నేహపూర్వకంగానే ఆ సమస్యను పరిష్కరించుకున్నారు.

Also Read: పరభాష చిత్రాలను నమ్ముకుంటున్న సీనియర్ హీరో.. మరో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసే పనిలో వెంకీ..

Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..

Music director Thaman: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా తమన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసాడంటున్నారే ..