5 జీ ట్రయల్స్ నిర్వహణకు నో పర్మిషన్, భారత ప్రభుత్వ నిర్ణయానికి అమెరికా ఎంపీల ప్రశంస
ఇండియాలో 5 జీ ట్రయల్స్ ను నిర్వహించడానికి చైనాకు చెందిన టెలికామ్ కంపెనీలను అనుమతించరాదన్న భారత నిర్ణయాన్ని అమెరికన్ ఎంపీలు పలువురు ప్రశంసించారు. దేశంలో 5 జీ ట్రయల్స్.....
ఇండియాలో 5 జీ ట్రయల్స్ ను నిర్వహించడానికి చైనాకు చెందిన టెలికామ్ కంపెనీలను అనుమతించరాదన్న భారత నిర్ణయాన్ని అమెరికన్ ఎంపీలు పలువురు ప్రశంసించారు. దేశంలో 5 జీ ట్రయల్స్ ను నిర్వహించేందుకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా, ఎంటీఎన్ఎస్ టెలికాం కంపెనీల దరఖాస్తులను ఇండియన్ టెలికాం డిపార్ట్ మెంట్ ఆమోదించింది. అయితే ఈ కంపెనీల్లో ఏవి కూడా చైనా సంస్థల టెక్నాలజీలను వినియోగించడం లేదు. ఇండియాలో 5 జీ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి కోరుతూ హువీ, జెడ్ టీ ఈ సంస్థలు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వీటిని మినహాయించాలని ఇండియా నిర్ణయించింది. ఇది ఆ దేశానికే కాక, మొత్తం ప్రపంచానికి కూడా మంచి వార్త అని హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ లీడ్ రిపబ్లికన్ అయిన మైఖేల్ మెక్ కాల్ అన్నారు. అమెరికాలో ఇదివరకటి ట్రంప్ ప్రభుత్వం కూడా చైనా టెక్నాలజీలు జాతీయ భద్రతకు ముప్పు అని అభివర్ణించింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్ లో ఉన్న టెక్నాలజీల వైపు మొగ్గు చూపవద్దని అమెరికా తన మిత్ర దేశాలను కోరుతోంది కూడా.ఈ ముప్పును ఇండియా కూడా గ్రహించిందని, చైనీస్ టెక్నాలజీ సెక్యూరిటీకి ఎంత ప్రమాదకరమో తెలుసుకుందని మెక్ కాల్ వ్యాఖ్యానించారు. మరో ఎంపీ మైక్ వాల్ట్ ఇండియాకు కృతజ్ఞత తెలిపారు.ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా ..చైనా పెడ ధోరణులను నిరసిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన సహచర ఎంపీలు పలువురు తనతో ఏకీభవిస్తున్నారని ఆయన చెప్పారు.
కాగా లోగడ కూడా చైనా టెలికాం ఈక్విప్ మెంట్ ని వినియోగించే బదులు లోకల్ టెక్నాలజీలను వాడాలనిభారత ప్రభుత్వం రెండు టెలికాం కంపెనీలను కోరింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు దేశీయంగా తయారైన పరికరాలనే కొనుగోలు చేయాలనీ, చైనా టెక్నాలజీల వైపు చూడరాదని సూచించింది. గతంలో చైనా వస్తువులను బహిష్కరించాలని ఇండియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. లడాఖ్ లో 20 మంది భారత సైనికుల మృతికి కారణమైన చైనా ఆధీనంలోని సంస్థలను పూర్తిగా బాయ్ కాట్ చేయాలని పలువురు నిపుణులు సూచించారు.
మరిన్ని వీడియోస్ చూడండి ఇక్కడ : ఊరు ఊరంతా ఐసోలేషన్!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral
viral video: రెండో ఎక్కం కూడా రాని వరుడు.. పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!