G7 meeting: జీ7 సదస్సులో కరోనా కలకలం.. పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు భారత ప్రతినిధులకు పాజిటివ్

COVID-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా సెకండ్ వేవ్

G7 meeting: జీ7 సదస్సులో కరోనా కలకలం.. పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు భారత ప్రతినిధులకు పాజిటివ్
JAISHANKAR
Follow us

|

Updated on: May 05, 2021 | 3:46 PM

COVID-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. జీ 7 స‌ద‌స్సులో పాల్గొనేందుకు లండ‌న్ వెళ్లిన భార‌త ప్ర‌తినిధుల్లో ఇద్ద‌రికి క‌రోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తినిధుల బృందంలోని స‌భ్యులంతా సెల్ఫ్ ఐసొలేష‌న్‌లో ఉన్న‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వం బుధ‌వారం వెల్లడించింది. జీ 7 గ్రూప్‌లో భార‌త్ స‌భ్య దేశం కాదు.. అయిన‌ప్ప‌టికీ లండ‌న్‌‌లో జ‌రిగే ఈ స‌ద‌స్సుకు భార‌త్‌తోపాటు ఆస్టేల్రియా, ద‌క్షిణ ఆఫ్రికా, ద‌క్షిణ కొరియా దేశాల‌ను బ్రిట‌న్ ఆహ్వానించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో కూడిన భార‌త‌ ప్ర‌తినిధుల బృందం లండ‌న్‌కు వెళ్లింది.

మ‌రోవైపు క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తినిధుల‌కు ప్ర‌తి రోజు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార‌త ప్ర‌తినిధుల్లో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వారంద‌రినీ సెల్ఫ్ ఐసొలేష‌న్‌లో ఉంచిన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వం తెలిపింది. భార‌త ప్ర‌తినిధులు వ‌ర్చువ‌ల్‌గా స‌ద‌స్సులో పాల్గొంటార‌ని పేర్కొంది. అయితే కేంద్ర మంత్రి జైశంక‌ర్‌కు క‌రోనా సోక‌లేద‌ని తెలిపింది. కాగా ఆయ‌న బ్రిట‌న్ అంత‌ర్గ‌త మంత్రితో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైన‌ట్లు స్థానిక‌ మీడియా ప్రకటించింది. కరోనా కలకలం నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్ వర్చువల్ ద్వారా జీ7 సమావేశంలో పాల్గొన్నారు.

Also Read:

Kamal Hassan Review: ఓటమిపై రివ్యూ స్టార్ట్ చేసిన లోకనాయకుడు.. కలత చెందొద్దు కఠినంగా పనిచేయాలన్న హీరో

Petrol and Diesel Rates: ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పెట్రో ధరల బాదుడు షురూ.. అసలేం జరుగుతోందంటే..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే