Music director Thaman: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా తమన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసాడంటున్నారే ..

ప్రస్తుతం టాలివుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ఇటీవల ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు మ్యూజికల్ గానూ హిట్ అవుతున్నాయి.

 Music director Thaman: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా తమన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసాడంటున్నారే ..
Ss Thaman
Follow us

|

Updated on: May 05, 2021 | 9:28 AM

Music director Thaman: ప్రస్తుతం టాలివుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ఇటీవల ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు మ్యూజికల్ గానూ హిట్ అవుతున్నాయి. అరవింద సమేత సినిమానుంచి తమన్ సంగీతంలో చాలా చేంజెస్ వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆతర్వాత అల వైకుంఠపురం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర్రస్తుతం తమన్ ఖాతాలో అరడజను కు పైనే సినిమాలున్నాయని తెలుస్తుంది.

అయితే వరుసగా హిట్స్ పడేసరికి తమన్ కూడా కమర్షియల్ బాట పట్టేశాడట. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ కూడా తమన్ చేతిలో ఉన్నాయి. దాంతో రెమ్యునరేషన్ ను పెంచేసాడట తమన్. క్రాక్ – వకీల్ సాబ్ లాంటి హిట్స్ అందుకున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీ అయిపోయాడు. ఓవైపు మహేష్ బాబుకు వరుసగా సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలకు అందిస్తున్నాడు. అలాగే నందమూరి బాలయ్యకు అఖండ సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు పలు తమిళ్ సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తునాడు  యువతరంగం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..

RGV D Company: రామ్‌గోపాల్ వ‌ర్మ డీ-కంపెనీకి క‌రోనా దెబ్బ‌.. వేరే మార్గం లేక ఓటీటీ బాట ప‌ట్టిన ఆర్‌జీవీ..

kangana Ranaut: త‌న ఖాతాను తొల‌గించ‌డంపై స్పందించిన కంగ‌న‌.. ట్విట్ట‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ క్వీన్‌..