kangana Ranaut: త‌న ఖాతాను తొల‌గించ‌డంపై స్పందించిన కంగ‌న‌.. ట్విట్ట‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ క్వీన్‌..

kangana Ranaut: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య వ్య‌వ‌హారం అనంత‌రం నుంచి సోష‌ల్ మీడియాలో ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య చేస్తూ నిత్యం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. ఒకానొక స‌మ‌యంలో...

  • Narender Vaitla
  • Publish Date - 5:51 am, Wed, 5 May 21
kangana Ranaut: త‌న ఖాతాను తొల‌గించ‌డంపై స్పందించిన కంగ‌న‌.. ట్విట్ట‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ క్వీన్‌..
Kangana Twitter

kangana Ranaut: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య వ్య‌వ‌హారం అనంత‌రం నుంచి సోష‌ల్ మీడియాలో ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య చేస్తూ నిత్యం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌. ఒకానొక స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్య‌వ‌హ‌రించిన కంగ‌న త‌న ట్వీట్ల‌తో సినిమా ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయాల‌ను హీటెక్కించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా కంగ‌నా ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన పోస్టు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.
తాజాగా బెంగాల్‌లో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై కంగ‌నా ట్విట్ట‌ర్ వేదిక‌గా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. దీంతో త‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌న్న కార‌ణంగా కంగ‌న ఖాతాను ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం శాశ్వ‌తంగా తొల‌గించింది. ఈ విష‌య‌మై ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించిన కంగ‌న ట్విట్ట‌ర్‌పై విరుచుకుప‌డ్డారు. త‌న అకౌంట్‌ను తొల‌గించ‌డం వ‌ల్ల ట్విట్ట‌ర్ పుట్టుకుతోనే అమెరికా అని రుజువు చేసుకుంద‌ని విమ‌ర్శించారు. నల్లజాతి వారిని శ్వేతజాతి ఎప్పుడూ బానిసలుగానే భావిస్తుందని… మనం ఏం ఆలోచించాలి.. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటారని కంగ‌నా తెలిపారు. ఇక త‌న గొంతు వినిపించ‌డానికి ట్విట్ట‌ర్ ఒక్క‌టే లేద‌ని మ‌రెన్నో మార్గాలున్నాయ‌న్నారు. సినిమా కూడా అందులో భాగ‌మేన‌ని కంగ‌నా వ్యాఖ్యానించారు. మ‌రి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Also Read: Viral Video : ఇంజెక్షన్‌ అంటే ఈ యువతి ఎలా భయపడుతుందో చూడండి..! వైరల్‌గా మారిన వీడియో..

Central Vista project: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆపండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

అనాథ పిల్లలను చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోకుడదు.. అలాంటి పిల్లల గురించి పోలీసులకు చెప్పండి.. కేంద్ర మంత్రి..