అనాథ పిల్లలను చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోకుడదు.. అలాంటి పిల్లల గురించి పోలీసులకు చెప్పండి.. కేంద్ర మంత్రి..

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వారి గురించి పోలీసులకు తెలియజేయాలని..కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ

అనాథ పిల్లలను చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోకుడదు.. అలాంటి పిల్లల గురించి పోలీసులకు చెప్పండి.. కేంద్ర మంత్రి..
Smriti Irani
Follow us

|

Updated on: May 04, 2021 | 9:43 PM

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వారి గురించి పోలీసులకు తెలియజేయాలని..కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం ప్రజలను కోరారు. అనాథ పిల్లల గురించి పోలీసులకు తెలియజేయండం చట్టపరమైన బాధ్యత అని.. అక్రమంగా దత్తత తీసుకోవడాన్ని నియంత్రించడానికి ప్రభుత్వానికి ప్రజలు సహాయం చేయాలని మంత్రి అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్మృతి ఇరానీ అక్రమంగా పిల్లలను దత్తత తీసుకోవడం పిల్లల శ్రేయస్సుకు మంచిది కాదని.. అలాగే ఇది అక్రమ రవాణాకు దారితీస్తుందని ఆమె వరుస ట్వీట్స్ చేశారు.

“కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేనట్లయితే వారి గురించి మీ జిల్లా పోలీసులకు లేదా శిశు సంక్షేమ కమిటీకి తెలియజేయండి. లేదా చైల్డ్ లైన్ 1098ని సంప్రదించండి. ఇది మీ చట్టపరమైన బాధ్యత” అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. అలాగే మరోక ట్వీట్ లో దత్తత తీసుకోవడం అనేది వేరొకరి అనాథ పిల్లలను ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం అని.. అలాంటి పిల్లలను.. పిల్లల సంక్షేమ కమిటీకి తీసుకెళ్లాలి. ఇక్కడ పిల్లల శ్రేయస్సు కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ట్వీట్ చేశారు.

ట్వీట్..

ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలని భావించే జంటలు లేదా కుటుంబాలు ఉంటే.. అనాథ పిల్లలు అందుబాటులో ఉన్నారని ఎవరైన సంప్రదించినట్లయితే.. అలాంటి వారి ఉచ్చులో పడకండి.. వారిని నివారించాలి అని ఆమె అన్నారు. దత్తత తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం. అలాంటి పిల్లల గురించి స్థానిక శిశు సంక్షేమ కమిటీ లేదా పోలీసులకు లేదా చైల్డ్ లైన్ 1908కు తెలియజేయండి. మనమందరం చట్టబద్దమైన దత్తత తీసుకునేలా చూడాలి. లేకపోతే దత్తత పేరిట అక్రమ రవాణా చేసే అవకాశం ఉంది. వారిని రక్షించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. అలాంటి పిల్లల ఫోటోలు, వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆమె కోరారు.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను తాను దత్తత తీసుకొని రెండెళ్ళపాటు వసతి, భోజనం, చదువుకు సంబంధించిన విషయాలు చూసుకుంటానని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది.

ట్వీట్స్..

Also Read: కరోనా బాధితులకు అండగా టాలీవుడ్ తారలు.. 300 మంది కోవిడ్ రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..

కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..