BEL Recruitment 2021: బీటెక్ విద్యార్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వూ ఆధారంగా ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
BEL Recruitment 2021: భారత ఎలాక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఉద్యోగాల నియమాకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు...
BEL Recruitment 2021: భారత ఎలాక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఉద్యోగాల నియమాకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* ఇందులో ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. * ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారే అర్హులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, టెలీ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తి చేయాలి.
* బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
* అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులు ఏప్రిల్ 21, 2021 నుంచి ప్రారంభమవుతుండగా.. మే 5, 2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* దరఖాస్తు చేసుకోవడానికి రూ. 500ని ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
* పూర్తి వివరాలకు https://bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Also Read: JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కేంద్రం ప్రకటన..
NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!