Power Grid Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Power Grid Recruitment 2021: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నార్తర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్-1 కోసం భర్తీ చేయనున్న ఈ పోస్టులను..
Power Grid Recruitment 2021: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నార్తర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్-1 కోసం భర్తీ చేయనున్న ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఫీల్డ్ ఇంజనీర్, సూపర్ వైజర్ ఉద్యోగాల నియామకం కోసం ఈ నోటిపికేషన్ విడుదల చేశారు. మొత్తం 97 పోస్టుల భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* మొత్తం 97 పోస్టుల్లో ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–30, ఫీల్డ్ ఇంజనీర్(సివిల్)–08, ఫీల్డ్ సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్)–47, ఫీల్డ్ సూపర్‌వైజర్(సివిల్)–12 ఉన్నాయి.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికచేయనున్నారు.
* ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 09 2021లోపు అప్లై చేసుకోవాలి.
* ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు అప్లై చేసుకునే వారు కనీసం 55శాతం మార్కులతో ఎలక్ట్రికల్ విభాగంలో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
* ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్)కు కనీసం 55శాతం మార్కులతో సివిల్ విభాగంలో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
* ఫీల్డ్ సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్) పోస్టుకుగాను కనీసం 55శాతం మార్కులతో సివిల్ సబ్జెక్టులో ఫుల్‌టైం ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
* పూర్తి వివరాల కోసం http://www.powergrid.in వెబ్‌సైట్‌ను చూడండి.
Also Read: NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!
SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 3