IIT Jodhpur Recruitment: ఐఐటీ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడంటే..
IIT Jodhpur Recruitment: దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - జోధ్‌పూర్ (ఐఐటీ) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా..
IIT Jodhpur Recruitment: దేశంలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – జోధ్‌పూర్ (ఐఐటీ) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 11లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* మొత్తం 50 పోస్టులలో సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (01), జూనియర్ అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్)–15, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (34) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
* అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్‌ను అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆఫీస్ ఆఫ్ ఎస్టాబ్లిస్‌మెంట్–2, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్‌పూర్, ఎన్‌హెచ్–62, నాగోర్ రోడ్, కార్వార్, జోధ్‌పూర్–342037 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా మే 11, 2021గా నిర్ణయించారు. ఇక దరఖాస్తులను పైన్ తెలిపిన అడ్రస్‌కు పంపడానికి చివరి తేదీ మే 20, 2021.
* పూర్తి వివరాలకు www.iitj.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అర్హతలు..
* సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసుకునే వారు.. పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటరైజ్డ్ లైబ్రరీ విధానంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 32 ఏళ్లు మించకూడదు.
* ఇక జూనియర్ అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుకు.. ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అవ్వాలి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 27 ఏళ్లు మించకూదడు.
* జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ విషయానికొస్తే.. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, బయో ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.