World Laughter Day: సరదాగా కాసేపు.. అన్నీ మరిచిపోదాం.. మనసారా నవ్వుకుందాం.. నవ్వుల దినోత్సవం సందర్భంగా..

నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది.. అని ఓ పాట ఉంది.. అవును..నవ్వితే మన సొమ్మేం పోదుగా.. ఒక్క చిరునవ్వుతో యద్ధాలెన్నో ఆపెయొచ్చు అని ఓ కవి రాశాడు. ఆయన ప్రేయసిని ఉద్దేశించి ప్రియుడి పలుకులుగా అలా చెప్పినా అందులోనూ వాస్తవం ఉంది.

World Laughter Day: సరదాగా కాసేపు.. అన్నీ మరిచిపోదాం.. మనసారా నవ్వుకుందాం.. నవ్వుల దినోత్సవం సందర్భంగా..
World Laughters Day
Follow us

|

Updated on: May 02, 2021 | 12:52 PM

World Laughter Day: నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది.. అని ఓ పాట ఉంది.. అవును..నవ్వితే మన సొమ్మేం పోదుగా.. ఒక్క చిరునవ్వుతో యద్ధాలెన్నో ఆపెయొచ్చు అని ఓ కవి రాశాడు. ఆయన ప్రేయసిని ఉద్దేశించి ప్రియుడి పలుకులుగా అలా చెప్పినా అందులోనూ వాస్తవం ఉంది. నవ్వడానికి పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అలా అని నవ్వు అంత ఈజీగా ఏమీ వచ్చేయదు. పెళ్ళాంతో గొడవ పడిన వాడి దగ్గరకు వెళ్లి కాస్త నవ్వరా బాబూ.. అన్నామంటే మన మూతి పళ్ళు రాలిపోతాయి. కానీ, కష్టంలోనూ చిరునవ్వుతో ఉండగలిగిన వారిని ఆ కష్టాలు ఏమీ చేయలేవు. అది సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఈరోజు (మే 2 ఆదివారం) ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఏదో నవ్వుల దినోత్సవం కదా అని నాలుగు నవ్వులు పంచుదామని ఈ ప్రయత్నం.

అసలే ఒక పక్క మహమ్మారి వేధించేస్తోంది. సరదాగా చెప్పుకునే ఒక్క మాట కూడా వార్తల్లో కనిపించడం లేదు. ఎటు చూసినా గందరగోళం. ఈ కల్లోలంలో కాస్త ఊపిరి పీల్చుకుందాం సరదాగా కాసేపు నవ్వుకుందాం. అన్నట్టు నవ్వంటే గుర్తొచ్చింది.. మొన్న ఎక్కడో ఒకావిడ వాళ్ళాయనను ”పెళ్లికాక ముందు నన్ను సినిమాలకు, పార్కులకు భలే షికార్లు తిప్పేవారు.. పెళ్లయ్యాక మీరు ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు..!” అంటూ గట్టిగా గొడవేసుకుంది. ఆయనకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు.. కూల్ గా ” పిచ్చదానా.. ఎలక్షన్లు అయ్యాకా ఇంకా ఎవరన్నా ప్రచారం చేస్తారా?” అన్నాడు. తరువాత ఏమైందని అడగొద్దు. మీరే ఊహించుకోండి ఏం జరిగి ఉంటుందో.

సరే, ఎటుచూసినా కరోనా.. కరోనాతో అది చేయొద్దు.. ఇది చేయొద్దు అంటున్నారు. ఈ మధ్య ఒకమ్మాయి పానీ పూరీ తినడానికి వెళ్ళింది. ఎక్కువగా అక్కడే ఆ అమ్మాయి పానీపూరీ తింటుంది. ఎప్పుడూ ఓ ప్లేట్ తినే ఆమె మూడు ప్లేట్లు లాగించేసింది. బిల్లు కట్టేసింది.. తర్వాత ”అన్నా..ఏమి ఈరోజు పానీ పూరీ ఈరోజు ఇంత బావుంది.” అని అడిగింది. ”అంటే ఈ మధ్య కరోనా గురించి చేతులు పదే..పదే శుభ్రం చేసుకుంటున్నాను అంతే.” అన్నాడు. మరిక ఆ అమ్మాయి జీవితంలో పానీ పూరీ జోలికి వెళుతుందో లేదో తెలీదు.

ఇక చిన్న పిల్లలు మాట్లాడుకుంటే భలే ఉంటుంది. ఓ ఇద్దరు గడుగ్గాయిలు మాట్లాడుకుంటే విన్నామంటే మనకి పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం. ఓ గడుగ్గాయి పక్కనే ఉన్న మరొకడికి ఇలా చెప్పాడు. ”చేపలు తిన్నవెంటనే నీళ్ళు తాగకూడదు తెలుసా” రెండో వాడు అడిగాడు ”అవునా? ఎందుకు?” వెంటనే మొదటి గడుగ్గాయి సీరియస్ గా ఇలా చెప్పాడు ” ఎందుకేంట్రా.. చేపలు తిన్న తరువాత నీళ్ళు తాగితే కడుపులో చేప ఈదడం మొదలు పెడుతుంది..దాంతో కడుపులో చక్కిలిగిలి పుడుతుంది.” నిజమే కదా.. చిన్నారులు వారికీ తెలిసీ తెలియక అనే ఇలాంటి మాటలు మనకి ఒక్కసారిగా రిలీఫ్ తెస్తాయి.

ఇలా చెప్పుకుంటూ పొతే నిజ జీవితంలోనే బోలెడు హాస్యం పుడుతుంది. మనం హాయిగా పాజిటివ్ గా ఉండాలి కానీ, ప్రతి సంఘటన లోనూ హాస్యం చూడొచ్చు. హాస్యం అంటే పడీ పడీ నవ్వేదే కానక్కర్లేదు. మనసును ఉల్లాసపరిచే చిన్న పంచ్ కావచ్చు.. అనుకోకుండా పెదవుల మీదకు చిరునవ్వు తీసుకొచ్చే చిన్న సందర్భం కావచ్చు. ఎప్పుడన్నా బాధ..లేదా మనసు కలవరంగా ఉన్నపుడు సరదాగా మీరు చూసిన సినిమాల్లోని ఓ మంచి కామెడీ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు కచ్చితంగా కొంత ఆందోళన తగ్గి.. మనసు బరువు తీరుతుంది.

ఇరుగూ పొరుగూ అన్నాకా కాస్త అవీ..ఇవీ మాట్లాడుకుంటారు కదా. అందులోనూ ఆడవాళ్లు.. ఒకావిడ పక్కింటావిడ దగ్గరకు వచ్చి ఏమండీ ఇది తెలుసా పక్క వీధిలో సుబ్బారావు గారు కోమాలోకి వెళ్లిపోయారట అంది కంగారుగా. దానికి ఆ పక్కింటావిడ బోలెడు డబ్బుంది కదా ఆయన కొమాలోకైనా వెళతారు.. ఎక్కడికన్నా వెళతారు. మనమే ఇలా కొట్టుకుంటూ ఛావాలి అంది కాస్త నిరాశగా.. పాపం ఆమెకు అలా అర్ధం అయింది.

ఇలా నిజ జీవితపు హాస్యాన్ని ఎంజాయ్ చేస్తూ.. నవ్వుల దినోత్సవం ఒక్కరోజే కాకుండా.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని.. కష్టాల కన్నీటిని నవ్వుల పువ్వులతో పక్కకు నేట్టేయాలనీ సంకల్పం తీసుకోండి. అంతే.. జీవితమంతా చిరునవ్వుల నావలో హాయిగా సాగిపోతుంది.

అన్నీ చెప్పి నవ్వుల దినోత్సవం ఎందుకు ఎప్పుడు మొదలైందో చెప్పకపోతే బాగోదు కదా.. ఈ రోజును 1998 సంవత్సరంలో డాక్టర్ మదన్ కటారియా అనే వ్యక్తి మొదటిసారి సృష్టించాడు. వృత్తిపరంగా ముంబైలో ఒక కుటుంబ వైద్యుడు ఈయన. అతను మన ముఖాలపై వ్యక్తీకరణలు మనకు ఎలా అనిపిస్తాయో నిరూపించే ప్రయత్నంలో నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించాడు. నవ్వు సహాయంతో ప్రపంచ శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం కోసం ఆయన ఈరోజును నవ్వుల దినోత్సవంగా జరుపుకోవాలని డిసైడ్ చేశాడు. అప్పటినుంచీ ఈ నవ్వుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కరోనా నేపధ్యంలో పెద్దగా హడావుడి లేదు కానీ, ప్రతి సారి ఈరోజున బోలెడన్ని నవ్వుల కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చేవారు.

చివరగా చిన్న జోక్. మనసారా నవ్వుకోండి.. ”భార్య: “ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది…!” భర్త: దానికి అంత భయం ఎందుకు? నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా? భార్య: ”ఉంది”. భర్త: ” ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్‌తో.. నీ మొహం కడుక్కో, మేకప్ పోయిన తర్వాత చూసి భయపడి వాడే పారిపోతాడు.. అన్నాడు కూల్ గా. హ్యాపీ లాఫర్స్ డే! ఇలాగే నవ్వుతూ గడిపేయండి!

Also Read: కోవిడ్ కేసుల అదుపునకు దేశవ్యాప్త లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం, టాస్క్ ఫోర్స్ సభ్యుల సూచన

Bandla Ganesh: గబ్బర్ సింగ్ సినిమాలో హీరోగా ఫస్ట్ ఆ హీరోని అనుకున్నారట..కానీ

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
ఆ ఇంట్లో తనిఖీలు చేయాలంటూ ఫోన్.. తలుపు తెరిచి చూసి పోలీసుల షాక్
ఆ ఇంట్లో తనిఖీలు చేయాలంటూ ఫోన్.. తలుపు తెరిచి చూసి పోలీసుల షాక్
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో