AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: గబ్బర్ సింగ్ సినిమాలో హీరోగా ఫస్ట్ ఆ హీరోని అనుకున్నారట..కానీ

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హాట్ గా నిలిచిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది.

Bandla Ganesh: గబ్బర్ సింగ్ సినిమాలో హీరోగా ఫస్ట్  ఆ హీరోని అనుకున్నారట..కానీ
bandla pawan
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: May 02, 2021 | 9:33 AM

Share

Bandla Ganesh: టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హాట్ గా నిలిచిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన దబాంగ్ సినిమాను తెలుగులో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసాడు. బండ్లగణేష్ ఈ సినిమాను నిర్మించాడు. ఖుషి సినిమా తర్వాత అంతటి రేంజ్ లో గబ్బర్ సింగ్ సినిమా హిట్అయ్యింది.  ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు పవన్. గబ్బర్ సింగ్ లో పవన్ నటన, ఆయన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక దేవీ శ్రీ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.

అయితే ఈ సినిమాను ముందుగా మాస్ మహారాజా రవితేజతో అనుకున్నారట. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నేను నిర్మాతగా మారడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అందుకే ఆయనను నేను దేవుడిగా భావిస్తా.. పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి తీన్ మార్ అనే సినిమా చేశా.. ఆసినిమా డిజాస్టర్ అయ్యింది. ఆసినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో నాకు ఇప్పటికీ అర్ధం కావడంలేదు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ పవన్ తో సినిమా చేయాలనీ అడగటానికి మొహమాటపడ్డాను.. పవన్ కళ్యాణ్ కు ఫ్లాప్ ఇచ్చినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. దాంతో గబ్బర్ సింగ్ సినిమాను రవితేజతో తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో పవన్ పిలిచి నాతో మరో సినిమా చేసుకో అన్నారు. దాంతో ఆయన్ను పెట్టి గబ్బర్ సింగ్ సినిమాను రూపొందించామని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.

మరిన్ని ఇక్కడ చదవండి :

నీలా డబ్బుకోసం తలపాగా ధరించను..! అక్షయ్ కుమార్‌పై హాట్ కామెంట్స్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్..?

OTT: ఆహా త‌ర్వాత రానున్న రెండో తెలుగు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌.. ఓటీటీ రంగంలోకి అడుగు పెట్ట‌నున్న నాగార్జున..?

NTR Koratala Shiva: విద్యార్థి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎన్టీఆర్‌..? నెట్టింట వైర‌ల్ అవుతోన్న‌ తాజా అప్‌డేట్‌..