RGV D Company: రామ్‌గోపాల్ వర్మ డీ-కంపెనీకి కరోనా దెబ్బ.. వేరే మార్గం లేక ఓటీటీ బాట పట్టిన ఆర్‌జీవీ..
RGV D Company: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ రంగం ఒకటి. కోట్లలో వ్యాపారం జరిగే సినీ పరిశ్రమ కరోనా కారణంగా మూగబోయింది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా, షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర నష్టాన్ని...
RGV D Company: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ రంగం ఒకటి. కోట్లలో వ్యాపారం జరిగే సినీ పరిశ్రమ కరోనా కారణంగా మూగబోయింది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా, షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే తర్వాత పరిస్థితులు చక్కబడడంతో మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సినిమాలు విడుదలయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ మరోసారి సినీ పరిశ్రమపై తన పంజాను విసురుతోంది. ప్రస్తుతం మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. దీంతో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన తాజా చిత్రం డీ-కంపెనీనీ ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఈ సినిమాను థియేటర్‌లో మార్చి 26న విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పట్లో థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో వర్మ.. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన స్పార్క్ ఓటీటీలోనే ఈ మూవీని ఈ నెల 15న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలిపారు. పే పర్ వ్యూ విధానంలో ఈ సినిమాకు ధరను నిర్ణయించనున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే వర్మ ఈ సినిమాను ముంబై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయనున్నారు.
Also Read: జర్నలిస్ట్‌గా మారనున్న అవికాగోర్.. రియల్ లైఫ్ ? లేదా రీల్ లైఫ్ అంటూ .. సందేహంలో ఫ్యాన్స్..
బాలీవుడ్లో కరోనా కలకలం.. కోవిడ్ బారిన పడ్డ దీపిక పదుకొనే.. ఆసుపత్రిలో హీరోయిన్ తండ్రి..
Allu Arjun: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌లో అల్లు అర్జున్.. డైరెక్టర్ గా ఎవరంటే.?