బాలీవుడ్‏లో కరోనా కలకలం.. కోవిడ్ బారిన పడ్డ దీపిక పదుకొనే.. ఆసుపత్రిలో హీరోయిన్ తండ్రి..

సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు

  • Rajitha Chanti
  • Publish Date - 9:16 pm, Tue, 4 May 21
బాలీవుడ్‏లో కరోనా కలకలం.. కోవిడ్ బారిన పడ్డ దీపిక పదుకొనే.. ఆసుపత్రిలో హీరోయిన్ తండ్రి..
Deepika Padukone

సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాకండా.. పలువురు ప్రముఖుల కుటుంబాలలోని వ్యక్తులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంది. మంగళవారం ఒక్కరోజు ఇద్దరు హీరోయిన్స్ సోదరులు కరోనా కాటుకు బలయ్యారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనేకు కోవిడ్ సోకింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై దీపికా స్పందించలేదు. కానీ ఆమె కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత నెలలో మహారాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో దీపికా ఆమె భర్తతో కలిసి బెంగుళూరుకు బయలుదేరింది.

ఇటీవల దీపికా తల్లిదండ్రులు, సోదరికి కరోనా సోకింది. ఆమె తండ్రి, ప్రముక క్రీడాకారుడు ప్రకాష్ పడుకొనే బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతోపాటు దీపికా తల్లి ఉజ్జల, సోదరి అనీషాకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవలే ప్రకాష్ వ్యాక్సిన్ మొదటి డోసును స్వీకరించారు. అయితే ప్రకాష్ పదుకొనే ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ప్రకాష్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దీపికా కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్ డ్రామా 83లో నటిస్తోంది. అలాగే పఠాన్, ఫైటర్, మహాభారతం, ది ఇంటర్న్ సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Nikki Thamboli: బిగ్‏బాస్ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. కరోనాతో నిక్కి తంబోలి సోదరుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్..

సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..

కరోనా కష్టాల్లో మానవత్వాన్ని చాటుకున్న యంగ్ హీరో.. అలాంటి పిల్లలను దత్తత తీసుకుంటానన్న సందీప్ కిషన్..